పవన్ తప్పు చేస్తున్నారా.. ఫ్యాన్స్ ని తిడుతూ టిడిపికి జై..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సైతం గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. అధికార పార్టీ వైసిపి ఇప్పటికే అభ్యర్థన ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు కాస్త వణుకు పుట్టించాలా చేస్తోంది. దీంతో టిడిపి జనసేన పార్టీ అలర్ట్ అయ్యి వెంటనే 118 సీట్లను సైతం ప్రకటించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. అటు జనసేన సైనికులు ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాస్త గందరగోళంగా ఉన్నారు తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలోనే టిడిపి జనసేన రెండు పార్టీలు కలిసి ఒక సభను కూడా ఏర్పాటు చేశాయి.

ఈ సభలో పవన్ కళ్యాణ్ ఫైర్ అవుతూ అటు అభిమానులను అధికార పార్టీని సైతం దూషిస్తూ టిడిపి పార్టీకి జై కొట్టడం మరింత కాకరెపెలా చేస్తోంది. త్వరలో జరగబోతున్న ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ పడుతుందని జనసైనికులు సైతం భావించగా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని చాలామంది నాయకులు కూడా ఆశను పెట్టుకున్నారు. కానీ ఇటు అభిమానులను కార్యకర్తలపై నీళ్లు చల్లారు పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయనకే జై కొడుతున్నారు..

సీట్ల విషయంలో కూడా జనసేన అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు నిరాశలు మిగులుతున్నాయి.. ఇప్పుడు జనసేనకు అండగా ఉన్న ఫ్యాన్స్ ని సైతం మీరు నాకు అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన తీరు చూస్తూ ఉంటే జనసేన పార్టీకి ఇంతటి దౌర్భాగ్యం అంటూ పలువురు అభిమానులు వాపోతున్నారు. జనసేన పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చేవారు అవసరంలేదని పార్టీ గెలుపు కోసం పోరాడే వాళ్ళు కావాలంటూ ఎద్దేవా చేశారు.. తనతో నడవాలి అనుకుంటే ఎవరూ కూడా ఎవరిని ప్రశ్నించకూడదంటూ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. దీంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయన పైన ఆగ్రహం చేస్తున్నారు.. దీంతో పలువురు నాయకులు అభిమానులు పవన్ కళ్యాణ్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారంటూ వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: