ఈసారి గట్టిగానే ప్లాన్ వేసిన సీఎం జగన్..!!

Divya
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రజలకంటే ముందుగానే క్యాడర్ ని సిద్ధం చేసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజున మరో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాడర్ తో పాటు ప్రాంతాలవారిగ సిద్ధం సభలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్న సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,000 మంది కీలక నేతలతో మరొకసారి సిద్ధం భేటీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో తిరిగి ఎలా గెలవాలనుకునే విషయం పైన దిశా నిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో వచ్చే ఎన్నికలలో 175 కు 175 సీట్లు ఎలా సాధించాలని విషయం పైన మాట్లాడుకునే అవకాశం ఉంది.ఇందుకోసం చేయవలసిన పనులేంటో అనే విషయాలను కూడా స్పష్టంగా తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నారు. నేతలు ప్రజలకు ఓటర్లకు అందుబాటులోనే ఉండాలంటూ సూచిస్తున్నారు.. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ ప్లానింగ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలని రాబోయే 45 రోజుల పాటు చాలా కీలకమంటూ తెలియజేశారు. రాష్ట్రస్థాయి కేంద్రస్థాయి కార్యాలయాలలో ఎలాంటి పనులు జరగబోతున్నాయి అనే విషయాన్ని అన్నిటిని పర్యవేక్షిస్తున్నామంటూ తెలిపారు.

మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలని వచ్చే ఎన్నికలలో ప్రతి ఎన్నికల బూతులు 60 శాతం ఓట్లు పడేలా చేయాలని జగన్ కార్యకర్తలకు, నేతలకు , ఎంపీ ఎమ్మెల్యేలకు  సూచించారు. చంద్రబాబు తప్పుడు హామీలను ఇచ్చి మోసం చేశారని తాము అలా చేయలేదని ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామంటూ ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలంటూ కూడా సూచించారు.. ఈ ఎన్నికలు కులపోరు కాదని వర్గ పోరు అన్నట్టుగా గుర్తు చేశారు జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తాయని వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమం ఆగిపోతుందనే విధంగా తెలియజేయాలని సూచనలు ఇచ్చారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ముందుకు వెళ్లాలంటే సూచించారు.. ఎల్లప్పుడూ జనాలలో ఉండాలని అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా సమాధానం చెప్పాలి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: