టీడీపీ-బీజేపీ పొత్తు.. ఈ లిస్టు వైరల్‌.. నిజమేనా?

Chakravarthi Kalyan
ఏపీలో పొత్తుల చిక్కుముడి వీడటం లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరిందికానీ ఇరు పార్టీలతో కలిసి వెళ్లే విషయంలో బీజేపీ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీతో పొత్తు విషయంలో మీన మేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల సమయంలో పొత్తులపై క్లారిటీ కోసం చంద్రబాబు కాషాయ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో కలిసి మాట్లాడినా ఇప్పటి వరకు వారి వైఖరేంటో తెలియరాలేదు.

ఏపీలో ప్రస్తుతం బీజేపీ రెండు వర్గాలుగా ఉంది. ఒకటి మొదటి నుంచి  ఆ పార్టీనే నమ్ముకున్న నేతలు. రెండోది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు. ప్రస్తుతం ఏపీ బీజేపీ వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. పురంధేశ్వరి, సుచనా చౌదరి, సీఎం రమేశ్, పాతూరి నాగభూషణం, యామినీ శర్మ, దినకర్ వంటి నేతలు వేరే పార్టీ నుంచి వచ్చిన వారే.

అసలైన బీజేపీ నాయకులు, సంఘ్ పరివార్ నేతలు పార్టీలో నామ మాత్రపు పదవుల్లో ఉన్నారు. అయితే ఇతర పార్టీ నేతలు బీజేపీని పొత్తుల వైపు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఆ విధంగా అధిష్ఠానంపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా వీరికి మద్దతుగా ఉంటుంది. అసలు బీజేపీ, టీడీపీ పొత్తు వైపు మరల్చింది వీళ్లే.

ఇప్పుడు తాజాగా పొత్తు ఖరారైందని.. పోటీ చేసే స్థానాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సుజనా చౌదరికి విజయవాడ, తపనా చౌదరికి ఏలూరు, పురంధేశ్వరి రాజమండ్రి, సీఎం రమేశ్ విశాఖపట్నం, తిరుపతికి రత్నప్రభ అంటూ ఓ లిస్ట్ ను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీని నమ్ముకున్న నేతలకు ఏం ఉండవా అంటే వారికోసం ఒకటి రెండు స్థానాలను కేటాయిస్తారు. అవి సోము వీర్రాజు, జీవీఎల్ వంటి నేతలు ఎదురు తిరుగుతారు అని వారికి కొన్ని సీట్లను ప్రకటించి లిస్ట్ ను సర్క్యూలర్ చేస్తున్నారు. బీజేపీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: