రాజకీయాలనుంచి చంద్రబాబుకు రెస్ట్.. నారా భువనేశ్వరి మాటలకు అదేనా..?

Divya
కుప్పం ప్రజలు చంద్రబాబుని ఎప్పుడు గెలిపిస్తూనే ఉన్నారు.. అయితే ఈసారి రాజకీయ ఎన్నికల బరిలో కుప్పంలో చంద్రబాబు నాయుడుకు బదులుగా ఆయన భార్య భువనేశ్వరి నిలవబోతున్నట్లు ఇటీవలే తెలియజేసింది.. ఇన్నేళ్లుగా సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేకపోయినా చంద్రబాబునాయుడు కనీసం మంచినీళ్లు ఇచ్చిన ఘనత కూడా పొందలేకపోయారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాక తమ పార్టీ సైతం ఎలాంటి భేదాలు లేకుండా అన్ని నియోజవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి ఒక కీలకమైన ప్రకటన చేశారు.

అదేమిటంటే ఇక చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తన పోటీ చేద్దాం అనుకున్నట్టుగా బహిరంగ సభలో తెలియజేసింది.. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖలే మారిపోయాయని అభివృద్ధి పనులు కూడా చేపట్టారని దీంతో చంద్రబాబు ఓటు భయం పట్టుకుంది అంటూ తాజాగా ఆయన భార్య నారా భువనేశ్వరి సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలాన్ని రేపుతోంది.. దాని కుప్పం నుంచి పోటీ చేస్తాను అన్నట్టుగా తెలుపుతోంది నారా భువనేశ్వరి. దాదాపుగా కుప్పం నుంచి 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారని ఆయనకు ఈసారి రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయబోతున్నట్లుగా కూడా తెలిపారు.
భువనేశ్వరి చేసినటువంటి ఈ వాక్యాలు సైతం ఇప్పుడు రాజకీయాలలో చాలా కీలకమైన వాక్యాలుగా ఉంటున్నాయి.చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నారని అందుకే సరిగ్గా రెండు నెలలకు ముందు తన భార్యతో ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా భువనేశ్వరి మాటలను చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. 52 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబు అనారోగ్యం పైన వయసు మీద పడడం చేత చాలా ఇబ్బందికరంగా మారింది.. అలాగే వృద్ధాప్యం కూడా పెరగడంతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో తన కుమారుడు లోకేష్ ను ఎంత ఎంకరేజ్ చేసిన ఫలితం లేకుండానే పోతుంది. దీంతో చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే విధంగా అంతర్గత చర్చ జరుగుతోందని వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: