ఢిల్లీ : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్..మళ్ళీ ఫ్రీ

Vijaya

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంచలనమైన డెవలప్మెంట్ జరిగింది. పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఎలాంటి చెక్కులను కూడా ఆమోదించవద్దని ఐటి శాఖ బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. అయితే ఆదేశాలు ఇచ్చిన కొద్దిగంటల్లోనే మళ్ళీ ఖాతాలను ఫ్రీ చేసింది. తమ పార్టీ ఖాతాలను ఐటి శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలియగానే పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశారు.



అలాగే కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవ్వటం నూరుశాతం రాజకీయ ప్రేరేపితమైన చర్యగా మండిపడ్డారు. దేశంలోని ఏ పార్టీని కూడా స్వేచ్చగా దాని పని దాన్ని చేసుకోనివ్వకూడదని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లుగా ఎద్దేవాచేశారు. బీజేపీ తప్ప దేశంలో మరో పార్టీ ఏదీ ఉండకూడదన్నట్లుగా పెద్దలు నిర్ణయించారా అంటు నిలదీశారు. రు. 210 కోట్లు పన్నులు కట్టలేదన్న కారణం చూపి ఐటి శాఖ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయటంపై ఎన్డీయేతర పార్టీలు మండిపడుతున్నాయి.



కాంగ్రెస్ పార్టీ ఎందుకు రు. 210 కోట్ల పన్ను కట్టాలో ఐటి శాఖ చెప్పలేదు.  పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయటం కోసం ఐటి శాఖ ఏదో సాకుచెబుతున్నట్లే ఉంది. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాలను నర్జీవంచేయటానికి బీజేపీ కేంద్రప్రభుత్వంలోని శాఖలను అడ్డం పెట్టుకుంటోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను కొద్దిసేపటి వరకు ఫ్రీజ్ చేసేసింది ఐటి శాఖ.



ప్రతిపక్షాల నేతలపైకి ఈడీ, సీబీఐ వరుసబెట్టి నోటీసులు ఇవ్వటం, విచారణకు రమ్మని ఒత్తిడి చేయటం, ఏదో కారణంతో అరెస్టుచేసి జైలుకు పంపటంతో దేశ రాజకీయాల్లో అలజడి పెరిగిపోతోంది. ప్రతిపక్షాల నేతలపై ఎలాంటి ఆరోపణలను ఈడీ, సీబీఐ ప్రస్తావిస్తున్నాయో అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న బీజేపీ నేతల జోలికి మాత్రం దర్యాప్తు సంస్ధలు వెళ్ళటంలేదు. ఇక్కడే దర్యాప్తుసంస్ధలను కేంద్రంలోని పెద్దలే నడిపిస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరీ పద్దతి ఎంతకాలం నడుస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: