తెలంగాణ విమర్శలు.. ఏపీ సమాధానం ఏదీ?

Chakravarthi Kalyan
తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. తెలంగాణలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగుతాయి అనే సమయంలో నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపైకి ఏపీ పోలీసులు ప్రవేశించారు. తమ పరిధిలోకి వచచే గేట్ల ద్వారా నీటిని విడుదల చేసుకున్నాయి. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో సయోధ్య కుదిరినట్టే కనిపించింది.

ఏపీ స్వాధీనం చేసుకున్న నాగార్జున సాగర్ గేట్లతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం సూచించింది. దీనికి అంగీకరించినట్లే కనిపించిన తెలంగాణ మళ్లీ అడ్డుకట్ట వేసింది. అయితే ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ నేతలు దొంగలని.. దోపిడీ దారులని తెలంగాణ సంపదను దోచుకుపోతున్నారని.. తెలంగాణ నేతలు ఘాటు విమర్శలు చేశారు.  అయినా నాటి ఉమ్మడి నేతలు ఎవరూ కూడా నోరు మెదపలేదు.

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా నదికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీ జలాలకు సంబంధించిన కంట్రోలింగ్ బోర్డు పరిధిలో ఉంటేనే ఏపీకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాటాల ప్రకారం నీటిని విడుదల చేస్తుంది.

కానీ కేసీఆర్ బోర్డు పరిధికి అప్పజెప్పకండా నీటిని వాడేసుకుంటూ వచ్చారు. దీంతో జగన్ తన పోలీసుల్ని డ్యాంపైకి పంపిచడం కేంద్రం జోక్యం చేసుకోవడం, డ్యాం నిర్వహణ బోర్డు పరిధిలోకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన చర్చ దీనిపైనే నడిచింది. ఇరు పార్టీల నాయకులు ఆంధ్రా వాళ్లు దోచుకుపోతున్నారనే చెబుతున్నారు. ఇద్దరూ కూడా ఆంధ్రా వాళ్లనే తిడుతున్నారు. కాకపోతే ఈ అంశంపై ఆంధ్రా నాయకులెవరూ నోరు మెదపడం లేదు. మరి తెలంగాణ అసెంబ్లీలో ఇంత జరుగుతున్నా ఏపీ నుంచి ఒక్క నాయకుడు కూడా స్పందించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: