షర్మిలా.. మోడీపై చిల్లర భాష ఎందుకు?

Chakravarthi Kalyan
మాస్ వాళ్లకు అర్థం కాదు.. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద స్థాయి వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది అన్నట్లు ఉంది ప్రస్తుతం ఏపీలో విపక్షాల తీరు. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిల వ్యవహారం ఇప్పుడు సామాన్యుడికి అర్థం కావడం లేదు. అందుకు కారణం గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే.

ఏపీలో విపక్షాల్లో ప్రస్తుతం టీడీపీ, జనసేనలు మాత్రమే పొత్తులో ఉన్నాయి. మిగిలిన కాంగ్రెస్, బీజేపీలు ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నాయి. కాకపోతే పురంధేశ్వరి మాత్రం జనసేనకు, బీజేపీకి పొత్తు ఉందని చెబుతుంటారు. పవన్ మాత్రం చంద్రబాబుతోనే పొత్తు అని ప్రకటనలు చేస్తుంటారు. మరి ఈ విషయమై ఇద్దరూ స్పందించింది లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ ఎంట్రీ ఇచ్చారు.

దీంతో ఏపీ కాంగ్రెస్ లో కదలికలు వచ్చాయని.. కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని చెబుతున్నారు. ఇక షర్మిళ మైకు పట్టుకుంటే కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని వైసీపీని ఉతికి ఆరేస్తున్నారు. ఆ వివర్శల్లో ఎంత హేతు బద్ధత ఉందో పక్కన పెడితే కన్ను ఆర్పకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం స్పందిస్తోంది. కానీ బీజేపీ పై విమర్శలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైలంట్ గా ఉంటున్నారు.

అటు మోదీని.. ఇటు బీజేపీని ఏకి పారేస్తున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి షర్మిళపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టిన తెలంగాణ వలస నేత వైఎస్ షర్మిళ గారు.. సంచలనాల కోసం.. ప్రచారం కోసం చిల్లర భాషతో ప్రధాని ని విమర్శిస్తున్నారు. నీ తండ్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నీ భర్త అనీల్ కుమార్ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. తక్షణమే ప్రధాని కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: