లక్నో : రామమందిర్ కు ఎంత విరాళం వచ్చిందో తెలుసా ?
ఈనెల 22వ తేదీ కోసం ప్రపంచంలోని మెజారిటి హిందువులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అయోధ్యలోని రామమందిరం ఆలయంలో రామ, లక్ష్మణ, సీత విగ్రహాల ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక రంగంలో అనుభవజ్ఞులు, దేశంలోని ఇతర దేవాలయాలకు చెందిన ప్రముఖులు, నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రివర్గం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తో పాటు మంత్రులు, బీజేపీ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు.
దేశచరిత్రలోనే ఇంతటి ప్రాముఖ్యమున్న ఘట్టంలో పాల్గొనటాన్ని చాలామంది గొప్పఅవకాశంగా భావిస్తున్నారు. వందలాది ఎకరాల్లో నిర్మిస్తున్న దేవాలయానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అందరికీ తెలిసిందే. అందుకనే భక్తులను విరాళాలు ఇవ్వాల్సిందిగా రామమందిర్ ట్రస్ట్ పిలుపిచ్చింది. రామాలయ నిర్మాణానికి దేశంలోని 11 కోట్ల మంది జనాల నుండి రు. 900 కోట్ల విరాళాలను అందుకోవటాన్ని టార్గెట్ గా ట్రస్ట్ పెట్టుకున్నది.
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తు పోయిన ఏడాది డిసెంబర్ 23వ తేదీకి వచ్చిన విరాళాలు సుమారు రు. 5 వేల కోట్లు. ట్రస్టు టార్గెట్ గా పెట్టుకున్నది రు. 900 కోట్లయితే వచ్చింది రు. 5 వేల కోట్లు. శ్రీరామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రకారం దేశంలోని 18 కోట్లమంది విరాళాలు పంపించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రు. 3200 కోట్లు అందింది.
విరాళాలు మొత్తాన్ని ట్రస్ట్ బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేసింది. దీనిపైన వచ్చే వడ్డీతోనే ఆలయ నిర్మాణాన్ని చేసింది. ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీబాపూ ఆలయ నిర్మాణానికి ఏకంగా రు. 11.3 కోట్లు విరాళంగా అందించారు. అలాగే గుజరాత్ కు చెందిన గోవిండ్ భాయ్ ఢోలాకియా కూడా రు.11 కోట్లు విరాళమిచ్చారు. మొత్తానికి దేవాలయ నిర్మాణానికి దేశవిదేశాల నుండి వేల కోట్ల రూపాయలు విరాళాలు అందటం ఆశ్చర్యంగా ఉంది.