వర్షంలో తుపాకీతో విజయ్..పోస్టర్ చూస్తేనే పూనకాలు!

Amruth kumar
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన పుట్టినరోజు (మే 9) సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) స్పెషల్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు రవికిరణ్ కోలా ‘రాజా వారు రాణి గారు’ వంటి క్లాసిక్ తర్వాత విజయ్‌ను ఒక పక్కా రా అండ్ రస్టిక్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ పుట్టినరోజు కానుకగా వచ్చిన పోస్టర్ చూస్తుంటే, సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.వర్షంలో తడుస్తూ, చేతిలో తుపాకీ పట్టుకుని కూర్చున్న విజయ్ గుండెలపై.. ఒక అమ్మాయి తన కాలుతో తన్నుతున్నట్లు లేదా ఆపుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కాలు హీరోయిన్ కీర్తి సురేష్‌దే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బహుశా సినిమాలో విజయ్ మరియు కీర్తి సురేష్‌ల మధ్య జరిగే మొదటి పరిచయ సన్నివేశం ఇదే అయి ఉండవచ్చు. తనను ఎదిరించిన ఆ అమ్మాయి ధైర్యాన్ని చూసి విజయ్ మైమరచిపోయి చూస్తున్న ఆ ఎక్స్‌ప్రెషన్, వీరిద్దరి మధ్య ఉండబోయే ఇంటెన్స్ లవ్ స్టోరీకి అద్దం పడుతోంది.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ‘కాలీపట్నం రౌడీ’ అనే కాన్సెప్ట్‌తో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇందులో విజయ్ షర్టు లేకుండా, ఒళ్లంతా రక్తంతో, మాసిన గెడ్డం మరియు మీసాలతో ఒక ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జావియర్ (Christo Xavier) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది డిసెంబర్ 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


"నా చేతులకు ఉన్న రక్తం వాళ్ల మరణానిది కాదు.. నా పునర్జన్మది" అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవబోతోంది. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా విజయ్ మారుతున్న తీరు ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇస్తోంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత, థియేటర్లలో ‘రౌడీ’ మేనియా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఇప్పుడే ఊహించుకోవచ్చు!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: