ఇది కదా మెగా రేంజ్ అంటే..రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?

Thota Jaya Madhuri
మెగాపవర్ స్టార్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, కాన్సెప్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు “పెద్ది” సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా అయితే దేశవ్యాప్తంగా బలమైన ప్రమోషన్స్ ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే మేకర్స్ చాలా పెద్ద సర్ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన టీమ్, అక్కడ సినిమాకు భారీ హైప్ తీసుకురావడానికి మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీతో ముందుకు వస్తోందని సమాచారం.

తాజా బజ్ ప్రకారం, జార్ఖండ్‌లోని రాంచీ నగరంలో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ఇండియన్ క్రికెట్ లెజెండ్ ధోని ని ముఖ్య అతిథిగా తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ, ఇది నిజమైతే మాత్రం “పెద్ది” ప్రమోషన్స్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, “పెద్ది” సినిమాలో క్రికెట్‌కు సంబంధించిన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉండబోతుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. దీంతో ధోనీ ఈ ఈవెంట్‌కు హాజరవడం అసాధ్యం కాదని అభిమానులు భావిస్తున్నారు. పైగా రాంచీ అంటే ధోనీకి ఎంతో ప్రత్యేకమైన నగరం కావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ ధోనీ నిజంగానే ఈ ఈవెంట్‌లో పాల్గొంటే, అది కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారీ మీడియా అటెన్షన్‌ను తీసుకురాగల ప్రత్యేక మూమెంట్‌గా నిలిచే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: