అమరావతి : జగన్ ప్రయోగించబోతున్న కొత్త అస్త్రం

Vijaya


తొందరలో జరగబోయే జనరల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల మీదకు ఒక సూపర్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబునాయుడుకు ఎంత అవసరమో జగన్ కు కూడా అంతే అవసరం. జగన్ రెండోసారి గెలిస్తే టీడీపీ పని అయిపోయినట్లే. తెలంగాణాలో ఇపుడు టీడీపీ పరిస్ధితి ఎలాగుందో ఏపీలో కూడా పార్టీ పరిస్ధితి అలాగే అయిపోవటం ఖాయం. జగన్ రెండోసారి గెలిస్తే బహుశా చంద్రబాబు ఇక ఏపీలో పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనేది పెద్దగా ఉండదు.





ఇదే సమయంలో టీడీపీ గనుక గెలిస్తే జగన్ కు కష్టాలు మొదలైనట్లే అనుకోవాలి.  జగన్ కు ఎదురవ్వబోయే కష్టాలు ఎలాగుంటాయో కూడా ఎవరు ఊహించలేరు. అందుకనే ఒకళ్ళని మరొకళ్ళు దెబ్బతీసేందుకు ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ ఎంఎల్ఏలుగా కనీసం 40 మందిని కొత్త ముఖాలను దింపబోతున్నట్లు సమాచారం. ఇపుడు జగన్ ప్రయోగించబోయే అస్త్రం ఏమిటంటే బీసీ అస్త్రం. జనరల్ స్ధానాల్లో జగన్ బీసీ నేతలకు టికెట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం.





జనరల్ సీట్లంటే మామూలుగా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు నేతలనే పోటీలోకి దిగుతుంటారు. నిజానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. జనరల్ సీట్లలో పోటీ అంటే ఎక్కువగా  రెడ్డి, కమ్మ అభ్యర్ధులే ఉంటారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఛాన్సివ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట.





పోయిన పార్లమెంటు ఎన్నికల్లో జనరల్ సీట్లను బీసీలకు కేటాయించిన కారణంగా వైసీపీ బాగా లాభపడింది. అదేపద్దతిలో రాబోయే  అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువమంది బీసీలను పోటీకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జనాభాలోని అన్నీ సామాజికవర్గాల్లోకి బీసీల సామాజికవర్గాలే సగమున్నాయి. జగన్ చేయబోయే ధైర్యం కచ్చితంగా చంద్రబాబునాయుడు చేయలేరు. ఎంత సన్నిహితులైనా గెలవరని అనుకుంటే జగన్ టికెట్లు ఇవ్వరు. కానీ ఆ పని చంద్రబాబు చేయలేరు.  కాబట్టి జగన్ బీసీ అస్త్రం ఏ మేరకు ఫలితాలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: