ఇదీ పురందేశ్వరి- విజయసాయి వార్ రహస్యం?
అయితే కొన్ని రోజులుగా పురంధేశ్వరి వర్సెస్ విజయసాయి రెడ్డిల మధ్య ఎక్స్ తో పాటు పోటాపోటీ ప్రెస్ మీట్ల వార్ కూడా నడుస్తోంది. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ లా మారారని.. బీజేపీ ప్రయోజనాలను టీడీపీ కోసం తాకట్టు పెట్టారని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఎయిర్ ఇండియా సంస్థ అమ్మకం వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించి భారీగా లబ్ధి పొందారని విమర్శించారు.
అయితే పురంధేశ్వరి సైతం ఆరోపణలను తిప్పికొడుతూనే పదేళ్లుగా జగన్, విజయసాయి బెయిల్ పై బయట ఉన్నారని.. వారిపై ఉన్న కేసులు అతి తీవ్రమైనవని.. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని బయట గడుపుతున్నారని సుప్రీంకోట్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అయితే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి ఆమెను లక్ష్యం చేసుకోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
భవిష్యత్తులో టీడీపీ, జనసేనతో కలిసి పొత్తు కుదిర్చే సత్తా పురంధేశ్వరికి ఉందని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానంతో పురంధేశ్వరి మాట్లాడినట్లు వైసీపీకి సమాచారం అందింది. పొత్తు కుదిరితే ఆ పార్టీకి ఎదురుదెబ్బే. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే జగన్ కు చెక్ పెట్టడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే ఆమెను చంద్రబాబు ఏజెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కేంద్రంతో విభేదించకుండా కేవలం పురంధేశ్వరిపై వ్యక్తిగత విమర్శలకు పరిమితం అవుతున్నారు. మిగతా మంత్రులు అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు కాబట్టి విజయసాయి రెడ్డిని జగన్ వ్యూహాత్మకంగా దింపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.