గోదావరి : సంక్షోభం దెబ్బకు చేతులెత్తేసిందా ?

Vijaya



తెలుగుదేశంపార్టీకి సంబంధించి చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండే అతిపెద్ద సంక్షోభం. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి సీటుతో పాటు పార్టీని చంద్రబాబు లాకున్న దగ్గర నుండి ఇపుడు ఎదురైందే అతిపెద్ద సంక్షోభం. ఇందులో నుండి ఎలా బయటపడాలో తెలీక చేతులెత్తేశారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఎప్పటికి బయటకు వస్తారో తెలీదు. రేపో మాపో లోకేష్ అరెస్టు కూడా తప్పదనే ప్రచారం తెలిసిందే.



ఈ నేపధ్యంలో పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా బయటపడింది. చంద్రబాబు ప్లేసులో పగ్గాలు అందుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చినా ఎందుకనో తమ్ముళ్ళతో పాటు ఎల్లోమీడియా కూడా ఇష్టపడలేదు. దాంతో బాలయ్య సైడయిపోయారు. లోకేష్ ఢిల్లీలో కూర్చున్నా రాజమండ్రిలో ఉన్నా పెద్దగా తేడా ఉండదని పార్టీ నేతలే అంటున్నారు. మరీస్ధితిలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించేదెవరు ? ఈ విషయం అర్ధంకాకే తమ్ముళ్ళు  నానా అవస్తలు పడుతున్నారు. ఏ అచ్చెన్నాయుడో లేకపోతే ఇంకెవరైనా నాయకత్వంతో దూసుకుపోతారేమో అన్న భయంతో చంద్రబాబు వెంటనే పొలిటికల్ యాక్షన్ కమిటిని  ఏర్పాటుచేశారు.



ఇందులో సగంమంది నేతలు జనబలం లేని వాళ్ళే. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రమంతా ఆందోళనలు చేయాలని అచ్చెన్నాయుడు పిలుపిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎల్లోమీడియాలో తప్ప  రాష్ట్రం ఇంకెక్కడా అట్టుడకలేదు. దీంతోనే పార్టీని నాయకత్వ సమస్య ఎంతగా బాధిస్తోందో తెలిసిపోతోంది. ఇంతకుముందు ఎదురైన సంక్షోభాల నుండి పార్టీ బయటపడటం అంతా కథలే. ఎందుకంటే తన అవసరానికి చంద్రబాబే సంక్షోభాలను సృష్టించి తాను పార్టీని బయటపడేసినట్లు బిల్డప్ ఇచ్చేవారు. దాంతో పార్టీకి సంక్షోభాలు కొత్తకాదు, ఎదుర్కోవటమూ కొత్తకాదని కలరింగ్ ఇచ్చుకునే వారు.



సంక్షోభాలు, ఎదుర్కోవటాలు నిజమైతే గడచిన 21 రోజులుగా పార్టీ కార్యక్రమాలు ఎందుకు ఆగిపోయాయి ? చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు కంటిన్యు చేసుండచ్చు కదా. పాదయాత్రను లోకేష్ అర్ధాంతరంగా నిలిపేసి వెళ్ళి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నట్లు ? పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరు అని చూస్తే ఎవ్వరూ కనబడటంలేదు. తన తర్వాత తన స్ధాయిలో ఎవరినీ ఎదగనీయకుండా చంద్రబాబు చేసిన ఫలితమే ఇపుడీ సంక్షోభం.  మరి ఈ సంక్షోభం నుండి పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: