పవన్‌ను వైసీపీ నేతలు అలా అనకుండా ఉండాల్సింది

Chakravarthi Kalyan
రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సాధారణమే. అయితే ఆ విమర్శలు అనేవి రాజకీయాల పరంగా పక్క వాళ్ళ లోటుపాట్లను, లోపాలను గురించి ఎత్తి చూపేవిగా ఉండాలని కొంతమంది అంటున్నారు. దాని వల్ల అధికారపక్షం వాళ్ళు తనలోని లోటుపాట్లను తెలుసుకునే చక్కటి అవకాశం ఉంటుంది. అందుకే అధికార పక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా రాజకీయాల్లో అంతే ముఖ్యం.

గతంలో చంద్రబాబు  మొదలు పెట్టిన జన్మభూమి కమిటీల పేరు మీద అవకతవకలు ఉన్నాయని  పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఇప్పుడు వైఎస్ఆర్సిపి శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు  చంద్రబాబును గెలిపించాలని ఎందుకు అంత బలంగా అనుకుంటున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే టిజిఆర్ సుధాకర్ బాబు పై విధంగా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అంటున్న పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్లకి కూడా వాలంటీర్లే స్వయంగా పథకాలు అందిస్తున్నారని తెలుసుకోవాలని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వద్దంటున్న పవన్  తిరిగి తెలుగుదేశం నాటి జన్మభూమి కమిటీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వాలంటీర్ల పై  హ్యూమన్ ట్రాఫికింగ్  ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ పై పోలీసులు సుమెటో గా కేసు నమోదు చేయాలని ఆయన అన్నట్లుగా సమాచారం.

18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ వాళ్ల వివరాలు కూడా అందించాలని ఆయన అన్నారు. అలా పవన్ కళ్యాణ్ వాళ్ల వివరాలు చెప్పలేని పక్షంలో వాలెంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అయితే ఆయన అంతవరకు మాట్లాడి ఉంటే బాగానే ఉండేది. కానీ వాలంటీర్ వ్యవస్థ పైన విమర్శించిన పవన్ కళ్యాణ్ నాలుకను వెయ్యి సార్లు కోస్తానని అనడం ఇప్పుడూ చర్చనీయాంశం అవుతుంది. విధానాలను విమర్శించడం తప్పు కాదు గాని, ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం ఏమిటి అని కొంతమంది రాజకీయ నిపుణులు అంటున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: