పాకిస్తాన్‌ ఆంటీ.. ఇండియా కుర్రాడితో లవ్‌.. కరెక్టేనా?

Chakravarthi Kalyan
పాకిస్థాన్ కు చెందిన ఒక మహిళ పబ్జీ ఆడుతూ లవ్ లో పడింది. ఆమె భర్త దుబాయ్ లో పని చేస్తుండగా నలుగురు పిల్లల తల్లి అయిన ఆ మహిళ పబ్జీ ఆడుతూ ఇండియా కు చెందిన ఒక హిందువును ప్రేమించింది. అంతే కాదు అతనితోనే ఉండటానికి సిద్ధమై పాక్ లో ఉన్న ఇల్లును అక్కడి రూ. 12 లక్షలకు అమ్మేసి భారత్ వచ్చేసింది. మతం మార్చుకున్నానని హిందువుగా మారిపోయానని చెబుతోంది. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

భర్త కష్టపడి దుబాయ్ వెళ్లి కుటుంబాన్ని పోషించడానికి నానా కష్టాలు పడుతుంటే ఇక్కడ ఆ డబ్బులను తీరిగ్గా ఖర్చు పెట్టి వాటితో జల్సాలు చేస్తూ పబ్జీ గేమ్ ఆడుతూ లవ్ లో పడింది. అది కూడా నలుగురు పిల్లలను దగ్గర ఉంచుకుని లవ్ చేయడం అంటే ఆమె తీరును ప్రజలు తీవ్రంగా తప్పు బడుతున్నారు.

సభ్య సమాజంలో తల దించుకునే పని చేసిన పాక్ మహిళ ఇండియాకు ఎలాగోలా వచ్చేసింది. ఇక్కడే ప్రేమలో పడిన యువకుడితోనే ఉంటానని చెబుతోంది. ఇలా చెప్పడం వెనక ఆమె రెండు రకాలుగా మోసం చేసిన వ్యక్తిగా మిగిలిపోతుంది. కట్టుకున్న భర్త కుటుంబం కోసం కష్ట పడుతుంటూ తన శారీరక సుఖం కోసం కన్ను మిన్ను ఎరగకుండా నలుగురు పిల్లలున్నారని ధ్యాస కూడా లేకుండా వేరే వ్యక్తి ఇష్టపడటం..

రెండోది తన దేశాన్ని కాదని తను పుట్టిన మతాన్ని కూడా కాదనుకోవడం మరో అంశం. రేపు ఇదే విధంగా ఆ యువకుడితో కలిసి ఉన్న తర్వాత చేయదని గ్యారంటీ ఏంటి? కాబట్టి గుడ్డి  ప్రేమ, పిచ్చి ప్రేమ అనుకుంటూ సోషల్ మీడియాలో ఏదో గేమ్ ఆడినంత ఈజీ కాదు. నలుగురు పిల్లలను కని ఇప్పుడు ఒకడితో ప్రేమ అంటే ఇండియాలో కాదు ప్రపంచ  దేశాల్లో కూడా దాన్ని అంగీకరించడానికి ఎవరికి మనసు ఒప్పదు. ఇలాంటి పిచ్చి ప్రేమలను తరిమికొడితేనే సమాజంలో కుటుంబ సంబంధాలకు న్యాయం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: