ఏపీలో కూటమి వస్తే.. పవన్ కళ్యాణ్ కు ఇచ్చే పదవి ఇదేనట?

praveen
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. మరో 30 ఏళ్ల పాటు ఇక ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు అని వైసిపి బల్ల గుద్ది మరి చెప్పింది. ఇలాంటి సమయంలో ఇక ఆ పార్టీని గద్దే దింపడమే లక్ష్యంగా 40 ఏళ్ళ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు నడుం బిగించారు. ఒంటరిగా వైసీపీతో పోరాడి గెలవలేం అని అర్థం చేసుకొని జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఉన్న అన్ని దారులను కూడా ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు గెలుపు ఎవరిని వరించబోతుంది అన్నది జూన్ 4న విడుదల కాబోయే ఫలితాలలో బయటపడబోతుంది.

 అంతకుముందే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఎవరికి ఏ పదవి దక్కబోతుంది అనే విషయంపై ఇక చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే ఏ పదవిని కట్టబెట్టబోతున్నారు అనే విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం అందరికీ క్లారిటీ ఉంది  మరి జనసేన ని పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి? అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారట. లేనిపక్షంలో వైసిపి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకుంటుందట బిజెపి.

 ఇలా కూటమి ఓడిన గెలిచిన పవన్ మాత్రం పదవుల విషయంలో దూసుకెల్లడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో బలంగా ఉన్న బిజెపి దక్షిణ భారత దేశంలో కూడా పాగా వేయాలని అనుకుంటుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బిజెపి ఇక పట్టు సాధించాలని ఎన్నో రోజులుగా ఆశపడుతోంది. ఇక ఏపీలో బిజెపి పాతుకుపోయే విధంగా ఇప్పటికే ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హోం మంత్రి అమిత్ షా పన్నాగాల పందుతున్నారట. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారట  వైసీపీ లాగా అయిదుగురు డిప్యూటీ సీఎంలను కాకుండా పవన్ ఏకైక డిప్యూటీ సీఎం గా కూటమి గెలిచిన తర్వాత పదవి వచ్చే అవకాశం ఉందట  మరోవైపు కీలకమైన శాఖకు మంత్రిగా కూడా పదవిని చేపట్టే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. లేదంటే ఇక రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉందట. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: