విదేశీ ఉద్యోగం కోసం వెళితే.. చీకటి గదుల్లో పెట్టి.. వ్యభిచారం చేయించి?

Chakravarthi Kalyan
దేశంలో ఎలాగూ ఆశించిన స్థాయిలో సంపాదన లేదు అనో.. కోరుకున్న ఉద్యోగం రావడం లేదు అనో.. మరో కారణం చేతనో చాలా మంది యువత విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో కొంతమందికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దొరగ్గా.. మరికొంతమంది మాత్రం ఏజెంట్ల చేతిలో మోస పోయి చిత్రవధ అనుభవిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

మంచి ఉద్యోగం సంపాదించి.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఆశతో చాలా మంది యువత పలువురు ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన కొంతమంది విశాఖకు చెందిన యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో వారు పెట్టే నరకయాతన అనుభవిస్తూ మగ్గిపోతున్నారని అంటున్నారు. కాంబోడియాలోని చైనా దేశీయుల గుప్పిట్లో బలైపోతున్న విశాఖ యువకలు కష్టాల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ దుర్మార్గుల బారి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి  ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు.

ఈ క్రమంలో విశాఖ నగరం నుంచి వెళ్లిన సుమారు 150 మంది ఆ క్రూరులు బారిన పడినట్లు తెలుస్తోంది. బాధితుల్లో మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఆకర్షణీయ జీతం, ఏసీ గదుల్లో కంప్యూటర్ ముందు పనిచేయడమే, పైగా బ్యాంకాక్ కొలువులు అనే తీయని మాటలు నమ్మి రూ. లక్ష నుంచి లక్షన్నర చెల్లించిన వారిని ఏజెంట్లు బ్యాంకాక్ తీసుకువెళ్తారు.

విమాన టికెట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్ వంటి సదుపాయాలతో కొంత నగదు సమకూరుస్తారు. అనంతరం వీరిని బ్యాంకాక్ ఏజెంట్లకు అప్పగిస్తారు. అక్కడి ట్రావెల్ ఏంజెట్ వీరిని కాంబోడియాలోని చైనా సంస్థలకు అప్పగిస్తారు. అక్కడి వీరి చేత ఏడాది పాటు అగ్రిమెంట్ చేయించుకుంటారు. మధ్యలో వెళ్లాలంటే రూ.400 డాల్లరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సంతకాలు చేసిన వారిని ముందు చీకటి గదుల్లో ఉంచి చిత్ర హింసలకు గురి చేస్తారు. చెప్పినట్లు వినకపోతే భోజనం, నీరు అందించరు. అలా దారికి వచ్చిన వారి చేత సైబర్ మోసాల్లో శిక్షణ ఇప్పిస్తారు. ఇలా దోచిన మొత్తంలో ఒకశాతం కమీషన్ ఇస్తారు. ఈ క్రమంలో పలు రకాల వ్యసనాలకు బానిసలను కూడా చేస్తారు. అదే మహిళలు అయితే వ్యభిచార కూపంలోకి కూడా దింపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: