అమరావతి : ఇక మద్యం షాపుల్లో సమస్యలుండవా ?
ఎప్పటినుండో వినిపిస్తున్న డిమాండ్ అమల్లోకి రాబోతోంది. ఇంతకీ ఆ డిమాండ్ ఏమిటంటే మద్యంషాపుల్లో ఆన్ లైన్ విధానం పెట్టాలని. కూరగాయలు, పండ్లు అమ్ముకునే తోపుడు బండ్లలో కూడా యూపీఐ విధానం అంటే జీపే, గుగుల్ పే, పేటీయం విధానాల్లో డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటపుడు మద్యంషాపుల్లో మాత్రం ఈ పద్దతిని ఎందుకు అమలుచేయరని వినియోగదారులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇదే విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం భారీఎత్తున అవినీతికా పాల్పుడుతోందని అరోపణలు చేస్తున్నాయి. ఇలా అన్నీవైపుల నుండి వస్తున్న ఒత్తిడి కారణమో లేకపోతే ఇంకేదైనా ఉందో తెలీదుకానీ మద్యంషాపుల్లో అమ్మకాలకు ఆన్ లైన్ పేమెంట్లను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ర్యాండంగా 15 షాపుల్లో ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ మేమెంట్ల విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో చెప్పారు.
ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు కాబట్టి వెంటనే రాష్ట్రమంతా ఆన్ లైన్ విధానాన్ని అమలుచేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 2934 షాపులున్నాయి. ఇవికాకుండా వాక్ ఇన్ స్టోర్లు, టూరిజం ప్రాంతాల్లో దుకాణాలు కలిసి మరో 800 దాకా ఉన్నాయి. వీటిల్లో ఎందులో కూడా ఆన్ లైన్ విధానం అమలుకావటంలేదు. మద్యంషాపుల్లో ఆన్ లైన్ విధానం కాకుండా డబ్బులిచ్చి బాటిళ్ళు తీసుకునే పద్దతిలో చాలా అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎంఆర్పీ ధరలకన్నా ఎక్కువ ధరలకు మద్యాన్ని అమ్ముతున్నట్లు ప్రధాన ఆరోపణుంది. అదే అమ్మకాల్లో డబ్బులు తీసుకునే బదులు యూపీఐ మేమెంట్ పద్దతి తీసుకొస్తే చాలావరకు అవినీతి కంట్రోల్ అవుతుంది. ఎలాగంటే చేసే ప్రతి రూపాయి పేమెంట్ ఆన్ లైన్లో ప్రభుత్వ ఖాతాలోకి జమైపోతుంది. షాపుల్లో మద్యం అమ్మేవాళ్ళచేతికి ఒక్కరూపాయి కూడా వెళ్ళదు. పైగా ఏ మద్యాన్ని ఏ షాపులో ఎంతకు అమ్ముతున్నారనే విషయం తెలిసిపోతుంది. ఎలాగూ తమజేబులోకి ఒక్కరూపాయి కూడా రానపుడు షాపుల వాళ్ళు కూడా ఎక్కువకు అమ్మాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆన్ లైన్ పద్దతిపై జనాలు హ్యాపీ ఫీలవుతున్నారు.