అమరావతి : ఉద్యోగులను ఎల్లోమీడియా రెచ్చగొడుతోందా ?

Vijaya


ప్రభుత్వ ఉద్యోగులను ఎల్లోమీడియా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగుల సంఘాల నేతలకు మద్య మూడురోజుల క్రితం చర్చలు జరిగాయి.  ఆ చర్చల్లో చాలా అంశాలపై  రెండువర్గాలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఇరువర్గాల్లోను ఎందులోను ఏకాభిప్రాయం సాధ్యంకాదని అంచనా వేసింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగసంఘాలు ఆందోళనలు, సమ్మెలతో హోరెత్తించేస్తారని అనుకున్నది. అయితే ఎల్లోమీడియా అంచనాలకు విరుద్ధంగా సయోధ్య కుదరటంతో ఏమిచేయాలో దిక్కుతోచలేదు.అందుకనే క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులను రెచ్చగొడుతోంది. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానమైనది పెన్షన్ విధానమే. ఉద్యోగులేమో ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీమ్) కావాలని అంటున్నారు. ప్రభుత్వమేమో జీపీఎస్(గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్) అమలుచేస్తానంటోంది. ఇక్కడే ఇంతకాలం ఇరువైపులా ప్రతిష్టంభన నెలకొంది. జీపీఎస్ లో చివరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇచ్చేట్లు, ఏడాదికి రెండు డీఆర్ లు ఇచ్చేట్లుగా క్యాబినెట్ ఆమోదించింది. దీనికి ఉద్యోగసంఘాల నేతలంతా అంగీకరించారు. దీన్నే ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది.ఉద్యోగులంతా ప్రభుత్వంపై భగ్గమంటున్నట్లు కథనాలు ఇస్తోంది. ఉద్యోగులను ప్రభుత్వం మోసంచేసిందన్నది. ప్రభుత్వం తమను నట్టేట ముంచినట్లు ఉద్యోగులు ఆక్రోసిస్తున్నట్లు వార్తలు రాసింది. నేతలతో సంబంధంలేకుండా ఉద్యోగులే ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కథనాలు వండివారుస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఓపీఎస్ విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు రద్దుచేశాయి. దీనివల్ల ప్రభుత్వంపై విపరీతమైన ఆర్ధికభారం పడుతోందని ప్రభుత్వాలు ఈ విధానాన్ని రద్దుచేశాయి. దీని లోతుపాతులు తెలుసుకోకుండా 2019 ఎన్నికల ముందు ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తానని జగన్ హామీఇవ్వటం తప్పే.అప్పుడుచేసిన తప్పుకు ఇంతకాలం జగన్ మూల్యం చెల్లిస్తునే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దుచేస్తానన్నారు. అయితే ప్రత్యామ్నాయం సిద్ధం కాకపోవటంతో దాన్ని రద్దుచేయలేదు. ఇపుడు జీపీఎస్ సిద్ధమవటంతో వెంటనే సీపీఎస్ ను ప్రభుత్వం రద్దుచేసింది. నిజానికి చాలామంది ఉద్యోగులు జీపీఎస్ బాగానే ఉందంటున్నారు. చివరి వేతనంలో 50 శాతం పెన్షన్ అంటే అంతకన్నా కావాల్సిందేముంది ? అందుకనే మెజారిటి ఉద్యోగులు హ్యాపీగానే ఉన్నారు. అయితే ఎల్లోమీడియా మాత్రం ఉద్యోగులను బాగా రెచ్చగొడుతోంది. జగన్ చేసింది తప్పే అనుకుందాం. మరి చంద్రబాబునాయుడు ఏమన్నా జీపీఎస్ స్ధానంలో ఓపీఎస్ విదానాన్నే తీసుకొస్తానని హామీ ఇస్తున్నారా అదీలేదు. మరిక ఎల్లోమీడియా గోలేమిటో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: