అమరావతి : ఎల్లోమీడియా అడ్డంగా దొరికిపోయిందా ?

Vijaya




ఈసారి ఎల్లోమీడియాకు గట్టి షాక్ తప్పేట్లు లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడ్డిగా కళ్ళుమూసుకుని ధ్వేషం పెంచుకున్నందకు ఫలితం అనుభవించక తప్పదనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అసెంబ్లీ వేదికను, గవర్నర్ అబ్దుల్ నజీర్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎల్లోమీడియాలో తప్పుడు వార్త వచ్చింది. అసెంబ్లీలో జరిగిన ఒక ఘటనను టీడీపీ ఎంఎల్ఏ పయ్యావుల  కేశవ్ ఆరోపణను ఎల్లోమీడియా గుడ్డిగా క్యారీచేసింది.



ఇంతకీ పయ్యావుల చెప్పింది ఏమిటంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన  గవర్నర్ జగన్ కోసం వెయిట్ చేశారట. గవర్నర్ ను జగన్ తనకోసం వెయిట్ చేసేట్లు చేయటం గవర్నర్ ను అవమానించటమే అని నానా గోలచేశారు. జగన్ ప్రోటోకాల్ ఉల్లంఘించటమే కాకుండా సభా సంప్రదాయాలను కూడా మంటకలిపారంటు నోటికొచ్చింది ఆరోపించారు. కేశవ్ ఆరోపణల ఆధారంగా ఎల్లోమీడియా రెచ్చిపోయింది.



బ్యానర్ కథనంగా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద వార్తను వండివార్చేసింది. దాంతో అధికారపార్టీతో పాటు ప్రభుత్వం వార్తనుచూసి ఆశ్చర్యపోయింది. కేశవ్ ఆరోపణలతో పాటు ఎల్లోమీడియా కథనంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి వీడియో క్లిప్పుంగ్ ను ప్రదర్శించటం ద్వారా  వాస్తవం ఏమిటో చెప్పారు. అందులో గవర్నర్ కన్నా ముందే జగన్ అసెంబ్లీలోకి వచ్చినట్లు కనబడింది. గవర్నర్ ను జగన్ తో పాటు అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు స్వాగతం పలకటం, అందరు కలిసి స్పీకర్ ఛాంబర్లోకి తీసుకెళ్ళటం వీడియోలో స్పష్టంగా కనబడింది.



వాస్తవాలు వీడియో సాక్ష్యంతో స్పష్టంగా బయటపడటంతో కేశవ్ ఏదేదో సమర్ధించుకుంటున్నారు. కేశవ్ సంగతి సరే మరి వార్తను అచ్చేసిన ఎల్లోమీడియా ఏమి చేస్తుంది ? దీనిపైన చర్చ జరిగినపుడు కేశవ్ తో పాటు ఎల్లోమీడియా మీద కూడా ప్రివిలేజ్ కమిటి మీటింగులో చర్చించాలని స్పీకర్ డిసైడ్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా జగన్ పై తప్పుడు వార్తతో బురదచల్లుతున్న ఎల్లోమీడియాను అసెంబ్లీ వదిలిపెట్టేట్లుగా లేదు చూస్తుంటే. ఇంతకుముందు టీడీపీ నేత పట్టాభి విషయంలో కూడా ఇలాగే తప్పుడు వార్త రాసి తర్వాత క్షమాపణ చెప్పుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: