గోదావరి : పవన్ను నమ్ముకుంటే కాపుల కష్టమంతా వృధాయేనా ?

Vijaya




క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. బహుశా ఈ అనుమానం నిజమే అని అనుకోబట్టే వైజాగ్లో జరిగిన కాపునాడు బహిరంగసభకు కాపుల్లోని ప్రముఖులెవరూ హాజరుకాలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే కాపుల్లో ఒక సెక్షన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అవ్వాలని బలంగా కోరుకుంటోంది. కోరుకోవటమే కాదు జనసేన తరపున ప్రత్యక్షంగా కష్టపడుతోంది కూడా. సోమవారం నాటి విశాఖ బహిరంగసభలో ఈ విషయం స్పష్టంగా కనబడింది.





మాట్లాడిన వక్తలంతా డైరెక్టుగా చెప్పకపోయినా జనసేనకు ఓట్లేయాలని, పవన్ను సీఎం చేయాలని పిలుపిచ్చారు. కాపుల్లోనే మరికొంతమంది ప్రముఖులు డైరెక్టుగా పాత్ర పోషించకపోయినా పవన్ సీఎం అయితే బావుణ్ణని కోరుకుంటున్నారు. అవసరం వచ్చినపుడు లోలోపల ప్రముఖుల్లో అత్యధికులు  జనసేనకు ఓట్లేయించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతా బాగానే ఉందికానీ అసలు ముఖ్యమంత్రయ్యే ఉద్దేశ్యం పవన్ కు ఉందా అనేదే పెద్ద సందేహం. 




ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనే కోరికను పవన్ ఎప్పుడూ బయటపెట్టలేదు. తనకు అధికారం రావాలని, ముఖ్యమంత్రి అవ్వాలని బహిరంగసభల్లో కూడా పవన్ ఎప్పుడూ జనాలను కోరలేదు. పైగా రివర్సులో తనకు అధికారం ముఖ్యంకాదన్నారు. సీఎం అయిపోవాలనే కోరికతో పార్టీ పెట్టలేదని ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. పవన్ ముందన్న టార్గెట్లు రెండే. మొదటిది జగన్మోహన్ రెడ్డిని సీఎంగా దింపేయటం. ఇక రెండోదేమిటంటే చంద్రబాబునాయుడును సీఎం చేయటం.





తాను ముఖ్యమంత్రి అవ్వాలంటే అనుసరించాల్సిన వ్యూహం ఒకలాగుంటుంది. అదే ఇతరులను అధికారంలోకి తేవాలంటే వ్యూహం మరోలాగుంటుంది.  చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నట్లు ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాపుల్లోని ఒక సెక్షన్ పవన్ సీఎం కావాలని కోరుకుటుంటే పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే తన రాజకీయంపై పవన్లో క్లారిటి ఉందికానీ కాపుల్లోనే క్లారిటిలేదన్న విషయంలో మిగిలిన జనాలకు క్లారిటి వచ్చేసింది. ఈ నేపధ్యంలో పవన్ కోసం కాపులు పడుతున్న కష్టమంతా వృధాయేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: