ఏపీని వీడని వర్షాలు..మరో 3 రోజులు అలర్ట్..

Satvika
మండూస్ తుఫాన్ తీరం దాటి బలహీన పడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా ఏపీలో కనిపిస్తోంది. ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పాడనుందని తెలుస్తుంది. ఇప్పుడు మరో అల్పపీడన ముప్పు ముంచుకొస్తుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంల లో దిగువ టోపోస్పిరిక్ ఆవరణము లో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం దానికి అనుకుని ఉన్న మలక్కా, సుమత్రా జలసంధి వద్ద గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

కాగా, ప్రభావం తో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతుంది. దీని ప్రభావం తో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంల లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది.. చిత్తూరు, నెల్లూరు జిల్లా ల్లో నష్టం తీవ్రంగా ఉంది.

పుత్తూరు, నగరి లో తుఫాన్ ప్రభావం తో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు మంత్రి రోజా. తడుకు వద్ద అండర్ బ్రిడ్జిలో వరద నీరు నిలిచిపోవడం తో జేసీబీ సాయం తో పనులు చేపట్టారు. పుత్తూరు రైల్వే స్టేషన్ వద్ద వర్షం తాకిడి కి ఇళ్లు కూలిపోయాయి. తిరుపతి-తిరుమల క్షేత్రాన్ని వణికించేసింది తుపాను తాకిడి. భారీ వర్షంలో నే తడుస్తూ దర్శనానికి వెళ్లారు శ్రీవారి భక్తులు అవస్థలు పడ్డారు.. వర్షాల కు అలర్ట్ గా వుండాల ని అధికారులు హెచ్చరిస్తున్నారు.. నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టింది ఏపీ సర్కార్. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని సీఎం హామి ఇచ్చారు. వరుస అల్పపీడనాల పై ప్రజలు భయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: