కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్..ఆ రూల్స్ మారాయి..

Satvika
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మొన్నటివరకు గుడ్ న్యూస్ లను చెప్పింది.ఇప్పుడు భారీ షాక్ ను ఇస్తుంది.జులైలో పెరగాల్సిన డీఏ కోసం అప్పటి నుంచి ఎదురు చూశారు.అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరిస్తూవస్తుంది..ఇప్పటికీ దాని గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు..చివరకు సెప్టెంబర్ 28 న డీఏను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 4 శాతం డీఏను పెంచింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏను 4 శాతం పెంచింది. మరోవైపు ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే ప్రమోషన్ కోసం సర్వీస్ కండిషన్లను మార్చింది..


సెప్టెంబర్ 20నే డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ మెమోరండమ్ జారీ చేసింది. అందులో ప్రమోషన్లకు సంబంధించి మినిమమ్ సర్వీస్ రూల్స్ ను మార్చుతున్నట్టు ప్రకటించింది. అది కూడా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకే అని డీవోపీటీ స్పష్టం చేసింది. అలాగే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలోనూ పలు మార్పులు చేయనున్నారు. లేవల్ 1, లేవల్ 2 గ్రేడ్ ఉద్యోగులు కనీసం మూడు సంవత్సరాల సర్వీస్ చేసి ఉండాలని,అప్పుడే జీతం పెరుగుతుందని తేల్చి చెప్పింది.


లేవల్ 6 నుంచి లేవల్ 11 ఉద్యోగులు కనీసం 12 సంవత్సరాల సర్వీసు చేసి ఉండాలి. లేవల్ 7, లేవల్ 8 ఉద్యోగులు రెండు సంవత్సరాల సర్వీసు చేయాల్సి ఉంటుంది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు మార్చి 2022 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచారు. అప్పటి వరకు 31 శాతంగా ఉన్న డీఏను 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత బకాయిలను కూడా చెల్లించారు. సెప్టెంబర్ 28న జులైలో పెంచాల్సిన డీఏను 4 శాతానికి పెంచారు. అంటే 34 నుంచి 38 శాతానికి పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఉద్యోగుల కోపంతో ఊగిపోతున్నారు..మరి ఎవరికీ జీతం పెరుగుతూంది అనేది త్వరలోనే స్పష్టత రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: