మీరు ఆధార్ ను పొంది పదేళ్లు అయితే ఇలా తప్పక చెయ్యాలి..

Satvika
ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఆధార్ తప్పనిసరి అయ్యింది..సబ్సిడీ అందుకోవాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, చివరికి కరోనా టెస్ట్, వ్యాక్సిన్ కోసం కూడా ఆధార్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డును కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి దాదాపు పదేళ్లు దాటుతోంది..ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులను జారీ చేస్తే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారులకు కీలక సూచన చేసింది. చాలా మంది ఆధార్ వినియోగదారులు ఆధార్ కార్డులో అడ్రస్, తాజా ఫొటో అప్ డేట్ చేసుకోకపోవడంతో ప్రస్తుత వివరాలతో సరిపోలక ఇబ్బందులు పడుతున్నారు..


భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధార్ కార్డు పొంది పదేళ్లు దాటిన వివరాలను అప్డేట్ చేసుకోని వారంతా తమ ఫొటో, తాజా చిరునామాను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. ఇందుకోసం ఆధార్ పోర్టల్ లో అప్డేట్ డాక్యుమెంట్ ఆప్షన్ ను తీసుకువచ్చినట్లు వెల్లడించింది..వినియోగదారులు సమీపంలోని ఆధార్ సెంటర్ ను సంప్రదించి సైతం తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే.. ఇది తప్పనిసరి అని ఆధార్ స్పష్టం చెయ్యలేదు..


అయితే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయించడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఓ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్‌డేట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఆ 27 డాక్యుమెంట్స్ ఇవే..పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ లేదా ఇ-పాన్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లేదా ఇ-వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధాల లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్, ఫోటో ఉన్న క్రెడిట్ కార్డ్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్...


పూర్తి పేరు లేదా ఇంటి పేరు మార్చాలనుకుంటే కొత్త పేరుతో గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరు ఉన్న ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్, విడాకులకు సంబంధించిన పత్రం, దత్తత తీసుకున్నట్టు సర్టిఫికెట్, లింగ మార్పిడి చేసుకున్నట్టైతే అల్లోపతి డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ ఐడీ ప్రూఫ్స్‌గా సబ్మిట్ చేయొచ్చు..ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, పేరు అప్‌డేట్ చేయించడం, తప్పులు సరిదిద్దుకోవడం, ఇతర వివరాలు అప్‌డేట్ చేయడం కోసం ఆధార్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ సబ్మిట్ చెయ్యాల్సి వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: