పదోతరగతి విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్ న్యూస్..!!

Satvika
ఇండియా అతి పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ ను చెప్పింది.విద్యార్థుల కోసం స్కాలర్షిప్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది.తాజాగా పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 11వ తరగతిలో చేరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 11వ తరగతి ప్రవేశం పొంది ఉండాలి. అలాగే పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000లోపు ఉండాలి. కరోనా కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.ఇందుకు ఎంపికైన విద్యార్థులకు 10000 చొప్పున రెండేళ్ళు స్కాలర్షిప్‌ ను అందిస్తున్నారు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ దృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ తదితర డ్యాక్యుమెంట్లు ఉండాలి. స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు..

కాగా,ఇంటర్‌ పూర్తి చేసిన వారికి కూడా ఎల్‌ఐసీ స్కాలర్షిప్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి. అలాగే విద్యార్థులు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల పేరెంట్స్‌ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు..ఈ నెల 30 వ తెదీన దరఖాస్తుల స్వీకరన ముగియనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: