అమరావతి : లోకేష్ మీద జూనియర్ దెబ్బ ఇంత గట్టిగా పడిందా ?

Vijaya






నారా లోకేష్ మీద జూనియర్ ఎన్టీయార్ దెబ్బ చాలా గట్టిగానే పడినట్లుంది. జూనియర్ ఎఫెక్ట్ కారణంగానే తొందరలో లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ను బీజేపీలో చేర్చుకోవటం లేదా బీజేపీకి సేవలందించటమే టార్గెట్ గా అమిత్ భేటీ అయ్యారనే ప్రచారం అందరికీ తెలిసిందే.



అమిత్-జూనియర్ భేటీపై టీడీపీలో కూడా బాగా చర్చ జరిగింది. దీంతో చంద్రబాబునాయుడు తర్వాత టీడీపీ పగ్గాలు జూనియర్ కే దక్కుతాయనే ప్రచారం కూడా మొదలైపోయింది. వారసుడి హోదాలో లోకేష్ లో అంతటి సామర్ధ్యంలేదని ఏదో చంద్రబాబు కొడుకు హోదాతో చెలామణి అయిపోతున్నాడనే ప్రచారం ఇప్పటికే చాలావుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ బాధ్యతలు జూనియర్ కు అప్పగించాలనే డిమాండ్లు వినబడుతున్నాయి.




చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అక్కడంతా జూనియర్ పేరుతో ఫ్లెక్సీలు, జెండాలతో జూనియర్ అభిమానులు గోలగోల చేస్తున్న విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలతో పార్టీపగ్గాల విషయంలో లోకేష్ లో ఏమైనా కలవరం మొదలైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. తనను తాను గట్టి నేతగా ప్రూవ్ చేసుకునేందుకు లోకేష్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. సరిగ్గా ఇదే సమయంలో అమిత్-జూనియర్ భేటీ జరగటం పార్టీలో ఒక విధంగా సంచలనమే అయ్యింది.



పార్టీలో జూనియర్ గురించి బాగా చర్చ జరుగుతోంది. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు జూనియర్ ను పార్టీలో యాక్టివ్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో ఇక లాభంలేదని అనుకుని లోకేష్ పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లున్నారు. పార్టీపై తనదే పూర్తి పట్టని నిరూపించుకోవటం, జనాల్లో తనకు తిరుగులేదని చూపించుకోవటమే టార్గెట్ గా పాదయాత్రకు రెడీ అవుతున్నట్లున్నారు. జూనియర్ కన్నా ఎందులోను తాను తక్కువకాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేష్ పై పడింది. అందుకనే అర్జంటుగా పాదయాత్ర ఫీలర్లు వదిలారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: