సీఎం కేసీఆర్ పై ''ఐటీ దాడులు'' జరిగేనా ?
అయితే ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత సదరు బీజేపీ నాయకులపై వివిధ కోర్ట్ లలో కేసులు వేసింది. ఇది ఒక పక్క సాగుతుంటే... మరోవైపు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇంతలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఈ విషయంపైన చేసిన వ్యాఖ్యలు సంచలనముగా మారుతున్నాయి. బీజేపీ నాయకులు చెప్పిన విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర ఉంటే చర్యలు తీసుకోవాడ్నైకి ఎందుకు వెనుకాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక గతంలో సీఎం కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ కి పంజాబ్ ఎన్నికల వేళ ఆర్ధిక సాయం చేసినప్పుడు... కేసీఆర్ పై మరియు వారి కుటుంబసభ్యులు మరియు బంధువుల ఇల్లు మరియు ఆఫీస్ లపై ఎందుకు ఐటీ శాఖ దాడులు చేయలేదు .
ప్రస్తుతం ఈ విషయం హిట్ టాపిక్ గా మారింది. దీనిని బట్టి త్వరలోనే ఐటీ శాఖ కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తుల ఇళ్ళల్లో ఐటీ సోదాలు జరుగుతాయని భావిస్తున్నారు. నిజంగానే ఈ సమయంలో ఐటీ దాడులు జరిగితే కేసీఆర్ పరిస్థితి ఏమిటి ?