కర్ణాటక: టిప్పు సుల్తాన్ పోస్టర్ దగ్ధం?

Purushottham Vinay
మొన్నటి వరకు కూడా కర్ణాటకను హిజాబ్ వివాదం కుదిపేసినా తాజాగా టిప్పు సుల్తాన్ పోస్టర్ దగ్ధం వివాదం అనేది మొదలైంది. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ పోస్టర్‌పై పెద్ద దుమారం రేగింది.ఇక భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను కొంతమంది ధ్వంసం చేశారు. దీనిపై శనివారం నాడు రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం నాడు రాత్రి బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ దగ్గర కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కొందరి నాయకుల పోస్టర్‌లను ఏర్పాటు చేసింది. ఇక అందులో టిప్పు సుల్తాన్ పోస్టర్ కూడా ఉంది. అయితే అక్కడ టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను ఎవరో చించి పడేశారు. దాంతో పెద్ద వివాదం రాజుకుంది.ఘటనా ప్రదేశాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి. శివకుమార్ శనివారం నాడు సందర్శించారు. ఇక ఆయన ఈ చర్యను ఖండించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఇంకా కాంగ్రెస్‌ స్వాతంత్య్ర యాత్రను జీర్ణించుకోలేకపోతున్నారని శివకుమార్ విమర్శించారు.ఆగస్ట్ 15 వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఫ్రీడం మార్చ్‌ను చేపట్టనుంది.


ఇక ఈ పాదయాత్ర సంగొల్లి రాయన్న సర్కిల్‌ నుంచి ప్రారంభమై బసవనగుడి నేషనల్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ముగుస్తుంది. ఈ దేశం కోసం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడమే పాదయాత్ర లక్ష్యమని డి.శివకుమార్ చెప్పారు.అలాగే కవాతు ద్వారా వీరులకు నివాళులు అర్పించడం తమ హృదయపూర్వక ప్రయత్నమని ఆయన అన్నారు.ఇక ఇందులో భాగంగానే ఆ పార్టీ వివిధ స్వతంత్ర సమరయోధుల పోస్టర్‌లను ఏర్పాటు చేసింది. అయితే వాటిల్లో టిప్పు సుల్తాన్ పోస్టర్ కూడా ఉండడం వివాదంగా మారింది.అయితే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అంశం అనేది పలుమార్లు వివాదాస్పదం అవుతుంది. టిప్పు సుల్తాన్ ప్యాలెస్, విగ్రహాలు ఇంకా బడుల్లో ఆయనకు సంబంధించిన పాఠాలు వంటి అంశాలపై తీవ్ర వివాదాలు చెలరేగాయి.కర్ణాటక రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. బీజేపీ టిప్పు సుల్తాన్‌ను దేశ ద్రోహిగా కూడా ఆరోపణలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే వివాదాలు అనేవి రాజుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: