తెలంగాణ లేటెస్ట్ ఎన్నికల సర్వే... ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే ?

VAMSI
తెలంగాణాలో రానున్న ఎన్నికలపై అన్ని పార్టీలు ఇప్పటి నుండి ఒక కన్ను వేసి ఉన్నాయి. కేసీఆర్ ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని సకల ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఇక విపక్ష పార్టీలు కాంగ్రెస్, షర్మిల, బీజేపీ లు కేసీఆర్ ను దించాలని కాచుకు కూర్చున్నాయి. అయితే కేసీఆర్ భయపడం కాదు కానీ ముందస్తు జాగ్రత్తగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సాయం కోరాడు. ఇప్పుడు పీకే తెలంగాణాలో తన టీం ను దించి తెరాస ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాడు. అందులో భాగంగా అసలు ప్రజల్లో తెరాస పై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి చేపట్టిన సర్వేలో తెరాస కు అనుకూలమైన రిపోర్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
సర్వే ప్రకారం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఎవరిమీద ఆధారపడకుండా తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీకే టీం స్పష్టం చేసింది. ఇక రెండవ స్థానంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పారు. కాగా గత రెండు సంవత్సరాల నుండి ఎంతో హల్ చల్ చేస్తున్న బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలకు చాలా దూరంలో నిలిచిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీజేపీ జాడ కూడా లేదని పీకే టీం సర్వే చెప్పింది. ఇక ముందు నుండి చెబుతున్నట్లుగానే కొంతమంది తెరాస నేతల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని, అలాంటివారిని తప్పక మార్చాల్సిందేనని పీకే గట్టిగా చెప్పారు.
ఇంకా కొంచెం సమయం ఉన్నందున ఆ నేతలు ప్రజలకు చేరువగా వెళ్లి తిరిగి నమ్మకాన్ని కూడగట్టుకుంటే తిరిగి సీట్ పొందే అవకాశం ఉంది అంటూ సదరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పీకే. ఇక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పింఛన్ లు మరియు కొత్త రేషన్ కార్డు లను వెంటనే మంజూరు చేస్తే తెరాస విజయం తధ్యం అంటూ పీకే టీం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: