పూజకు పనికిరాని పువ్వు అంటే ఏమిటి.. ఈ విషయం తెలుసుకోండి?

praveen
హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడిని పూలతో పూజిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రకరకాల పువ్వులు తెచ్చి పూజించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా పూజలో వాడే పూలు ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల పూలను పూజలో వాడటం అందరూ చూసే ఉంటారు. కానీ కొన్ని రకాల పూలను మాత్రం పూజ కోసం అస్సలు ఉపయోగించరు. ఈ క్రమంలోనే పూజకు పనికిరాని పువ్వు అనే మాట అప్పుడప్పుడు వింటూ ఉంటాం.

 ఇటీవలి కాలంలో సినిమాల ప్రభావం కారణంగా పూజకు పనికిరాని పువ్వు అనే మాటకు మరో అర్థాన్ని  తీసుకు వచ్చారు అందరు.  కానీ పూజకు పనికిరాని పువ్వు అంటే ఏమిటి.. ఇలా పూజలో వాడకూడని పువ్వులు కూడా ఉంటాయా అన్న  విషయంపై ఎంతోమందిలో ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. పూజకు పనికిరాని పువ్వు అంటే  ఎక్కడ ఎప్పుడు పూజ జరిగిన ఆ పువ్వులను అసలు పూజకు వాడరు అందుకే  పూజకు పనికిరాని పువ్వు అంటారు.  ఇక అలాంటిపూలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మొగలి పువ్వును పూజలో అస్సలు వాడరు. హిందువులు ఎక్కువగా ఈ మొగలిపువ్వు అబద్దానికి సూచికగా నమ్ముతుంటారు.

 అంతేకాకుండా ఇక మొగలి పూల వాసన  వెగాటుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చెట్టు ఉన్నచోట తప్పకుండా పాములు సంచరిస్తూ ఉంటాయట.  అందుకే పూజలో మొగలిపువ్వులు వాడటం వల్ల పాము లక్షణాలు మనుషులకు సోకితాయ్ అనే భావంతో ఇక ఈ పువ్వులు పూజలు వాడకుండా దూరం పెడతారట. అంతేకాకుండా బంతి పూల ను కూడా పూజలో వాడరు అనేది తెలుస్తుంది. కారణం క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే గుడిలోకి పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరట. కానీ బంతి పూల ను గుమ్మానికి మాత్రం కడతారు అన్న విషయం తెలిసిందే. ఇది కాకుండా వాసన పీల్చినవి, కింద పడినవి, ఎడమ చేతితో తెంపినవి కూడా పూజకి పనికిరాని పువ్వులు అని అంటుంటారు పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: