ఇక జూబ్లిహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ నిందితులు మైనర్లు కావడంతో ఈ అంశంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు.అయితే ఇక ఎప్పుడైతే నిందితుల్లో రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారని తెలిసిందో ఈ సంఘటన కాస్త ఇక పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. పోలీసులు కావాలనే నేరస్తులను తప్పిస్తున్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా కేసులో ఇంట్రెస్ట్ పెరిగింది. కేసును చేధించే క్రమంలో పోలీసులు చాలా దూకుడు పెంచారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సీన్ టు సీన్ అసలు ఏం జరిగిందో కోర్టుకు తెలిపారు. అలాగే ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 14వ తేదీ వరకు కూడా ఆ నిందితులను పోలీసులు విచారించనున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆ రేప్ చేసిన అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు షాకింగ్‌కు గురి చేస్తోంది. ఈ అత్యాచారం చేసిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి కుటుంబంపై ఫోకస్ ని పెట్టారు.
ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పారిపోవాలని మాస్టర్ ప్లాన్ కూడా వేసుకున్నారు. మే 31 వ తేదీ వరకు వేచి చూసిన నిందితులు, 31వ తేదీన బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే హైదరాబాద్‌ను వదిలి వెళ్లారు. మొత్తం ముగ్గురు నిందితులు ఆ నగరం వదిలి వెళ్లిపోయారు. ఇక బంజారాహిల్స్‌లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరార్ అయ్యాడు.అలాగే మరో నిందితుడు గోవాకు జంప్ అయ్యాడు. ఇక మూడో నిందితుడు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయాడు. దీంతో నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల సెర్చ్ ఆపరేషన్ ని కూడా మొదలు పెట్టారు.ఆ నిందితులు తమ ఫోన్‌లను స్విఛ్ ఆఫ్ చేయడంతో నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంకా అలాగే గోవాలకు ప్రత్యేక బృందాలను పంపించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.