వర్షం పడుతున్నప్పుడు.. ఉరుములు ఎందుకు వస్తాయో తెలుసా?

praveen
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వర్షాలు కురవడంతో అందరూ షాక్ అయ్యారు అనే విషయం తెలిసిందే. అయితే వర్షాలు కురిసాయని కొంతమంది సంతోషిస్తే కొంతమంది మాత్రం ఆందోళనలో మునిగిపోయారు. ఇక వేడిని తట్టుకునెందుకు కాస్త వాతావరణం చల్లబడేందుకు వర్షం కురవడం మంచిది అని కొంతమంది అనుకుంటే పంట చేతికి వచ్చే సమయానికి వర్షం కురిసి నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చిందని రైతాంగం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలా ఇటీవల కురిసిన వర్షంతో కొంతమంది ఆనంద పడితే మరికొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. అది సరే గానీ ఇప్పుడు వర్షం గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.

 సాధారణంగా వర్షం వస్తున్నప్పుడు లేదా వర్షం రావడానికి ముందు ఉరుముల శబ్దం ఎంత పెద్దగా వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కొన్ని సార్లు పిల్లలే కాదు పెద్ద వాళ్లు కూడా ఉరుముల శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతు ఉంటారు. ఇక ఇలా భారీగా ఉరుముల శబ్దం వచ్చి ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల పిడుగులు పడుతూ ఉంటాయి.  అయితే ఇలా వర్షం వచ్చే ముందు ఉరుములు ఎందుకు వస్తాయి అనేది చాలా మందికి తెలియ.దు ఇక ఉరుములు ఎందుకు వస్తాయి.. అసలు దీని వెనుక ఉన్న కథ ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

 మేఘాలకు నేలకు మధ్య పిడుగుపాటు అనేది చోటుచేసుకున్నప్పుడు దానికి సంబంధించిన విద్యుత్ ప్రవాహం సెకండులో వెయ్యో వంతు  కన్నా ఎక్కువ సమయం  సంభవిస్తూ ఉంటుందట. ఆ సమయంలో 27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉద్భవించడంతో గాలి హఠాత్తుగా దాని పరిసరాల్లో కి వ్యాకోచిస్తుంది. ఆ ప్రభావంతో ఉరుములు వచ్చేటప్పుడు పెద్దగా శబ్దం వస్తుందట. సరైన ఉదాహరణ చెప్పాలంటే సైకిల్ ట్యూబ్ ఒక్కసారిగా పగిలినప్పుడు దానిలో ఉన్న గాలి పెద్ద శబ్దం చేస్తూ బయటికి రావడం చేస్తూ ఉంటుంది. అలాగే పిడుగులు ప్రయాణించే సమయంలో ఆ మార్గంలో గాలి ఉన్నపలంగా దాని చుట్టుపక్కల కూడా వ్యాకోచించడం వల్ల పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: