EPFO : త్వరలో పెరగనున్న శాలరీ లిమిట్!

Purushottham Vinay
EPFO : EPFO మెంబర్స్ కి చక్కటి శుభవార్త. ఇక మీరు ఎక్కడైనా పని చేసి PF ఖాతా కలిగి ఉన్నట్లయితే ఇది మీకు చాలా మంచి ముఖ్యమైన వార్తనే చెప్పాలి. EPFO జీతం పరిమితి త్వరలో పెరుగుతుంది. ఇక తీసుకోబడ్డ ఈ చర్య  అనేది 75 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేయబడింది.ఈ ప్రతిపాదన EPFO కి సంబంధించిన పెన్షన్ కోసం జీతం పరిమితిని ప్రస్తుతమున్న రూ.15,000 నుండి రూ.21,000కి పెంచుతుంది.ఇది నిజంగా EPFO సభ్యులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే..ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ కోసం జీత పరిమితిని ప్రస్తుతమున్న రూ.15,000 నుండి రూ.21,000కి పెంచే పరిశీలనలు కొనసాగుతున్నాయి. 2014లో చివరి సవరణ చేసినందున EPFO సభ్యులు పెంపునకు అనుకూలంగా ఉన్నారు. ప్రతిపాదిత పరిమితిని పెంచడం వల్ల మరింత మంది వ్యక్తులు ఈ పరిధిలోకి వస్తారు. అయితే ప్రభుత్వమే భరించాల్సిన వ్యయభారంతో ఈ వ్యవహారం పచ్చజెండా ఊపడంతోనే ముందుకు సాగుతుంది. 




ఇక ప్రతిపాదిత పరిమితి పొడిగింపుకు ఉన్నత స్థాయి కమిటీ మద్దతు ఇచ్చింది.ఈపీఎస్‌లో జీతం పరిమితిని 15,000 నుంచి 21,000కి పెంచాలనే ఆలోచన ఉంది. EPFO బోర్డు సభ్యులు పరిమితిని 21,000కి పెంచడానికి అనుకూలంగా ఉన్నారు, అయితే ప్రభుత్వ ఆమోదం చాలా ముఖ్యమైనది. 6,750 కోట్ల వ్యయంతో ప్రభుత్వం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం మూల వేతనంలో 1.16% వాటా ఇస్తుంది. 15,000 వరకు సంపాదిస్తున్న వారికి ఈపీఎఫ్ పథకం అవసరం. జీతాల పరిమితిని పెంచడం వల్ల 75 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈపీఎఫ్‌ఓ పరిమితిని చివరిసారిగా 2014లో రూ.15,000కి పెంచారు.ఇది నిజంగా EPFO మెంబర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.EPFO అకౌంట్ వున్న ఉద్యోగులందరికి కూడా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: