అమరావతి : కమ్మ ప్రముఖులు జగన్ను తట్టుకోలేకపోతున్నారా ?

Vijaya



కమ్మ సామాజికవర్గాన్ని అణగదొక్కేస్తున్నాడనే బలమైన ముద్రను జగన్మోహన్ రెడ్డి మీద వేయటానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా క్యాబినెట్లో కమ్మోరికి జగన్ ప్రాతినిధ్యం కల్పించకపోవటాన్ని కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలోని కమ్మ ఎంఎల్ఏలు బాగానే ఉన్నారు కానీ మధ్యలో బయట పార్టీల వారికి, సామాజికవర్గంలో ప్రముఖులమని చెప్పుకునే వారికే అసలు సమస్యొచ్చింది.





ఇపుడిదంతా ఎందుకంటే నిజామాబాద్ లో కమ్మ సామాజికవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో జగన్ పై కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏపీలో జగన్ కమ్మ సామాజికవర్గాన్ని అణగదొక్కేస్తున్నట్లు మండిపడ్డారు. కమ్మోరిని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదంటు పెద్ద వార్నింగ్ ఇఛ్చారు.  జగన్ కు నిజంగానే ధైర్యముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని చాలెంజ్ చేశారు.





కమ్మ సామాజికవర్గాన్ని తక్కువగా చూస్తే జగన్ కే నష్టమని హెచ్చరించారు. కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నితే చూస్తు ఊరుకునేది లేదంటు రెచ్చిపోయారు. మూడు రోజుల క్రితం మాజీ ఎంఎల్ఏ కాట్రగడ్డ ప్రసూన కూడా ఇలాగే మాట్లాడారు. రెండు రోజుల క్రితం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ఇలాగే మాట్లాడారు. అసలు కమ్మ సామాజికవర్గాన్ని జగన్ ఎప్పుడు ? ఎక్కడ టార్గెట్ చేశారో మాత్రం చెప్పటంలేదు. మంత్రివర్గంలో కమ్మోరికి స్ధానం కల్పించకపోతే ఇక కమ్మవారిని టార్గెట్ చేసినట్లేనా ?






కమ్మ సామాజికవర్గాన్ని జగన్ వర్గ శతృవుగా చూస్తున్నారని మొదలుపెట్టింది జనసేన అధినేత పవన్ కల్యాణ్. వీళ్ళందరు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారే కానీ ఒక్క ఉదాహరణ కూడా చూపటంలేదు. వీళ్ల వైఖరి చూస్తుంటే కమ్మ సామాజికవర్గాన్ని జగన్ కు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచన అర్ధమవుతోంది. నిజంగా ఏ పార్టీ అయినా ఏ సామాజికవర్గాన్నైనా దూరం చేసుకుంటుందా ? ఒకపార్టీ అధికారంలోకి రావాలంటే అందరు ఓట్లేస్తేనే కదా వస్తుంది ? ఇంత మాత్రం ఇంగితం లేకుండా ఉంటుందా జగన్ కు. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే టీడీపీ ఉనికే లేకుండా పోతుందనే భయం కమ్మ ప్రముఖుల్లో కనేబడుతోంది. ఆ భయంలోనుండే వస్తున్నవే ఇలాంటి ఆరోపణలు, చాలెంజులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: