అమరావతి : పీకుడు భాష ఎక్కువైపోతోందా ?

Vijaya





రాష్ట్ర రాజకీయాల్లో డీసెన్సీ అనేది హద్దులు దాటిపోతోంది. నువ్వొకటంటే నేను పదంటాను అన్న పద్దతిలో ప్రతిపక్ష-అధికారపార్టీల నేతల పోటీలు పడుతున్నారు. సభ్యతమరచి ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల నుండి ఎక్కువైపోతోంది. అనేక అంశాలపై చంద్రబాబునాయుడు, నారా లోకేష్ మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఏమి పీకారంటు చాలా సార్లు మాట్లాడారు. అలాగే చాలామంది టీడీపీ నేతలు కొడాలినానిని పట్టుకుని రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారు.







కొడాలి నిర్వహించిన పౌరసరఫరాల శాఖ వరకు పరిమితం కాకుండా వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. దాంతో కొడాలి హద్దులు దాటిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరు చూసిందే. ఇటు టీడీపీ నేతలు మాట్లాడిందీ తప్పే అటు కొడాలి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమే అనటంలో సందేహంలేదు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో ప్రత్యర్ధులపై హద్దులు దాటిపోయి పరుషమైన భాషను ఉపయోగించింది కొడాలి మాత్రమే.







టీడీపీలో కూడా చాలామంది నేతలు ముఖ్యంగా బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, కూన రవికుమార్ లాంటి వాళ్ళు వివిధ సందర్భాల్లో యధేచ్చగా బూతులు మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. ఇపుడిదంతా ఎందుకంటే నంద్యాల సభలో ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తన వెంట్రుకను కూడా పీకలేరు అని జగన్మోహన్ రెడ్డి అనటాన్ని చంద్రబాబు మద్దతు మీడియా పెద్దగా హైలైట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.







ఇదే పీకుడు భాషను చంద్రబాబు, లోకేష్ మాట్లాడినపుడు ఇదే మీడియా నెగిటివ్ యాంగిల్లో హైలైట్ చేయలేదు. అలాంటిది ఇపుడు జగన్ వ్యాఖ్యలకు బ్యానర్ కథనాలుగా అచ్చేయటమే విచిత్రంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది ప్రధానంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు హద్దులు దాటిపోతున్నారన్నది వాస్తవం. జగన్ను ఉద్దేశించి టీడీపీ అధికారప్రతినిధి ఒకరు బోసెడీకే అన్నపుడు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. కాబట్టి నేతలంతా ఎవరి హద్దుల్లో వారుంటేనే ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. లేకపోతే జనాలే తగిన బుద్ధి చెబుతారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: