RIP అంటే అసలు అర్థం ఏంటి.. ఈ స్టోరీ మీకు తెలుసా?

praveen
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ నేటి రోజుల్లో వాడుతున్న పదం RIP. అయితే దీని వెనుక అర్థం ఏంటి అన్నది చాలామందికి తెలియదు. కానీ అందరూ ఎవరైనా చనిపోతే ఇలాగే నివాళులు అర్పిస్తున్నారు.  దీంతో  ఇదే ట్రెండ్ ను ఫాలో అవడం మొదలుపెట్టారు అందరూ. అయితే RIP అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అసలు దీని అర్థమేంటి ఇక ఈ పదం తెరమీదికి రావడం వెనక స్టోరీ ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు అని చెప్పాలి.

RIP అనేది ఒక షార్ట్ వర్డు అయినప్పటికీ ఇప్పుడు ఇది ఒక పదం గా వాడేస్తున్నారు. ఇంతకీ ఇక RIP అర్థం ఏమిటి అంటే ఎవరైనా మరణించిన తర్వాత సంబంధీకులు ఇక ఈ పదం ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటారు.. ఈ అర్థం కొంతమందికి తెలుసు. మరి RIP అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. RIP అంటే రెస్ట్ ఇన్ పీ..స్ ఇది ఒక లాటిన్ పదబంధం. రిక్వెస్ కాట్ ఇన్ పీస్ నుంచి ఉద్భవించింది. ఈ పదం రిక్వెస్ కాట్ ఇన్ పీస్ అంటే శాంతి లో నిద్రపోవడం.

 ఇక తెలుగులో ఈ పదానికి అర్థం ఆత్మకు శాంతి కలగాలి అని.. మరణం తర్వాత ఆత్మ శరీరం నుండి విడి పోతుంది. అయితే తర్వాత తీర్పు దినం రోజున 2  తిరిగి కలుస్తాయని.. క్రైస్తవ మతంలో నమ్ముతుంటారు. ఒక వ్యక్తి మరణిస్తే అతని ఆత్మ యేసుక్రీస్తు తో సరిపోలుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇలా RIP అనే పదాన్ని ఉపయోగించడం 18 వ శతాబ్దానికి చెందినది అని అంటూ ఉంటారు. 5వ శతాబ్దంలో సమాధులపై రిక్వెస్ట్ కాట్ ఇన్ పీస్ అనే పదాలు కనిపించాయి. అయితే క్రిస్టియానిటీ వ్యాప్తి తోనే ఇక ఈ పదం వాడకం పెరిగింది అనేది తెలుస్తుంది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ప్రతి ఒక్కరు కూడా RIP అంటూ చెబుతూ నివాళులు అర్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

RIP

సంబంధిత వార్తలు: