కొత్త జిల్లాలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ధరలు?
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సైతం మార్కెట్ విలువ పెంచడానికి రెడీ అయ్యారు. పనిలో పనిగా ఈ డిమాండ్ ను ప్రభుత్వం ఆదాయంగా కూడా మార్చుకోనుంది. అదే విధంగా ఈ నూతన జిల్లాల్లో విధులు పెరిగిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అవసరమే. కాగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి నిర్మాణం కొరకు దాదాపు 15 ఎకరాల స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక స్థలాల విలువల సవరణ విషయానికి వస్తే ఏప్రిల్ 6 నుంచి కొత్త ఆస్తుల విలువలు అమల్లోకి తీసుకురావాలని శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ఆస్తుల విలువను బట్టి రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరి కొత్తగా జిల్లాలు వచ్చాయని సంబర పడిన వారికి ఇది షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే వివిధ కారణాల చేత అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ ధరలు పెరగడం సామాన్యులకు తలకు మించిన భారం అనే చెప్పాలి.