ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్న జగన్..

frame ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్న జగన్..

VAMSI
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఢిల్లీ పర్యటనకు పరుగులు తీయటం వెనుక గల కారణాలు ఏవైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రధాన చర్చగా మారింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మంత్రి తో సైతం చర్చలు జరపడం విశేషం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళగా ఇపుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సైతం రేపు ఢిల్లీ పర్యటనకు బయలుదేరెందుకు సిద్దం అయ్యారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు  ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగ రేపు సాయంత్రం ప్రధాన మంత్రి మోదీ తో సిఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై ప్రధాని నిర్ణయం తీసుకోనున్నారు అని తెలుస్తోంది. ఈ సమావేశం లో పలు ప్రధాన అంశాలను ప్రదని దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట సిఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను ఈ భేటీలో ప్రస్తావించాలి అనుకుంటున్నారట సిఎం.
అందులో విద్యుత్ ఛార్జీలు, ధాన్యం కొనుగోలు,ప్రత్యేక హోదా వంటి అంశాలు కీలకం అని సమాచారం. వీటి గురించి వివరించేందుకు సిఎం జగన్ ఒక చిన్న మైండ్ మ్యాప్ ను రెడీ చేసినట్లు వినికిడి.


అదేవిధంగా ఈ ఢిల్లీ పర్యటన లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఏపి ముఖ్యమంత్రి  కలవబోతున్నారు అని అందుకు కావాల్సిన అపాయింట్మెంట్ లను సైతం ఇప్పటికే తీసుకోవడం జరిగింది అని తెలుస్తోంది. ఈ చర్చలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా ప్రధాన కారణమని సమాచారం. నేటి నుండి ఏపి లో కొత్త జిల్లాల ను సిఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగ వీట్ గురించిన కొన్ని విషయాలు అనగా అభివృద్ధి కొరకు నిధుల ఏర్పాటు వసతులు వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని అనుకుంటున్నారట. అలాగే ఈ పర్యటనలో అటు తెలంగాణ సిఎం ఇటు ఏపి సిఎం ఇరువురు కూడా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: