
ఏపీ: పవన్ ఇలాకాలో అశ్లీల డ్యాన్సులు..తిట్టిపోస్తున్న ప్రజలు..వీడియో వైరల్..!
న్యూడ్ అవతారంలో కనిపించి కుర్రాలని హీట్ ఎక్కిస్తూ ఉన్న డాన్స్ షోలు కూడా ఈ మధ్యకాలంలో వైరల్ గా మారుతున్నాయి. పిఠాపురం నియోజవర్గంలోమూలపేట గ్రామంలో పోలేరమ్మ జాతర జరుగుతూ ఉండగా అక్కడ నిర్వాహకులు రికార్డు డాన్సులు ఏర్పాటు చేయగా సుమారుగా 12 మంది అమ్మాయిలు ఈ డ్యాన్సులో పాల్గొనడం జరిగింది.. అయితే పాటలకు డ్యాన్స్ వేయడమే కాకుండా యువతను రెచ్చగొట్టేలా పాటలతో స్టెప్పులు వేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియోలు చూసిన వారందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ముఖ్యంగా ఇలా అమ్మవారి జాతరలో అశ్లీల డ్యాన్సులు వేయడం పైన కూడా తిట్టిపోస్తున్నారు. ఇక అక్కడి గ్రామం మహిళలు కూడా తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నారట.
ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అక్కడికి హెచ్చరించకపోవడంతో మరింత మండి పడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం నియోజవర్గంలోనే ఇలాంటి అస్లీల డ్యాన్సులు వేస్తూ ఉండడంతో వీరికి ఎలా పర్మిషన్ ఇచ్చారు అంటూ తీవ్రస్థాయిలో అక్కడి గ్రామస్తులు కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడంతో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఇక మీదట ఆయన ఇలాంటివి డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.