త్వరలోనే రాహుల్ తో గుడ్ న్యూస్.. అషూ రెడ్డి పెళ్లి చేసుకోబోతుందా.?

frame త్వరలోనే రాహుల్ తో గుడ్ న్యూస్.. అషూ రెడ్డి పెళ్లి చేసుకోబోతుందా.?

Pandrala Sravanthi
సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ఇండస్ట్రీకి రాకముందు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి రాహుల్ ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు వంటి పాట పాడిన సంగతి తెలిసిందే.ఇక రాహుల్ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ తర్వాత ఈయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా సూపర్ సింగర్ అనే షోలో జడ్జిగా కూడా అవకాశం వచ్చింది. అయితే అలాంటి రాహుల్ బిగ్ బాస్ లో ఉన్న టైంలో పునర్నవితో ప్రేమాయణం నడిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదంతా షో వరకే అని అందరికీ అర్థమైంది.ఇక బిగ్ బాస్ నుండి వచ్చాక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ యాంకర్ అయినటువంటి అషూ రెడ్డితో కూడా రిలేషన్ మెయింటైన్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారనుకున్నారు. 


కానీ అది జరగలేదు. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ పాడ్ కాస్ట్ లో అషు రెడ్డి రాహుల్ గురించి ఒక సర్ప్రైజ్ చెప్పింది.అయితే ఆ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష హోస్ట్గా చేస్తుంది. ఆ ఇంటర్వ్యూలో వర్ష తన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు అలాగే అషూ రెడ్డి తన జీవితంలో ఉన్న చేదు అనుభవాలు ఒకరికొకరు బయట పెట్టుకున్నారు.దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అషూ రెడ్డి ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. నాకు అరుణాచల శివుడు అంటే చెప్పలేనంత భక్తి అని శివుడి పై తనకి ఉన్న భక్తి బయట పెట్టింది.అలాగే ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది. అసలు ఆ ఇంటర్వ్యూ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఇంటర్వ్యూ చేశాను. మళ్లీ ఎప్పుడు కూడా ఆర్జీవిని కలవలేదు. అది నేను నా జీవితంలో చేసిన తప్పు అంటూ అషు రెడ్డి బాధపడింది.


అలాగే సింగర్ రాహుల్ నాకు చాలా ఫేవరెట్.ఆయనకి నేను రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటను డెడికేట్ చేస్తాను.అయితే మేమిద్దరం త్వరలోనే ఓ మంచి గుడ్ న్యూస్ తో వస్తున్నాం.అందుకే ఈ పాటను అంకితం చేస్తున్నాను అంటూ అషూ రెడ్డి చెప్పడంతో అషూ రెడ్డి మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఏంటి అషు రెడ్డి రాహుల్ తో గుడ్ న్యూస్ చెబుతానంటుంది అంటే కొంపదీసి ఇద్దరు పెళ్లి చేసుకోవడం లేదు కదా.. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదీ లేకపోతే గుడ్ న్యూస్ చెబుతా అని ఎందుకు అంటుంది అది కూడా రాహుల్ అని పేరు ఎందుకు తీస్తుంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది ఏమో సింగర్ రాహుల్ తో ఏదైనా కొత్త షో ప్రారంభిస్తుంది కావచ్చు అందుకే అలా మాట్లాడింది అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: