ఏపీలో కొత్త జిల్లాల ఫైనల్ లిస్ట్ ఇదే..?

Chakravarthi Kalyan
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అన్ని జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ లు జారీ చేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. మూడు రెవెన్యూ డివిజన్ల తో శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మూడు రెవెన్యూ డివిజన్లతో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. పార్వతీపురం కేంద్రంగా  మన్యం జిల్లా ఏర్పాటైంది.


పాడేరు కేంద్రం గా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటైంది. రెండు రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేశారు. రెండు రెవెన్యూ డివిజన్లతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు చేశారు. భీమునిపట్నం, విశాఖపట్నం  రెవెన్యూ డివిజన్లతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటైంది. రెండు రెవెన్యూ డివిజన్లతో అనకాపల్లి జిల్లా... రెండు రెవెన్యూ డివిజన్లతో కాకినాడ జిల్లా ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం డివిజన్లల్లోని మండలాలతో కాకినాడ జిల్లా ఏర్పాటైంది. మరో రెండు రెవెన్యూ డివిజన్లతో కోనసీమ జిల్లా ఏర్పాటైంది.


రాజమహేంద్రవరం కేంద్రం గా తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటైంది. భీమవరం కేంద్రం గా పశ్చిమగోదావరి జిల్లా.. ఏలూరు జిల్లా కేంద్రం గా ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా.. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా.. గుంటూరు జిల్లా కేంద్రంగా గుంటూరు జిల్లా.. బాపట్ల జిల్లా కేంద్రంగా బాపట్ల జిల్లా.. నరసరావు పేట కేంద్రం గా పల్నాడు జిల్లా.. ఒంగోలు జిల్లా కేంద్రం గా ప్రకాశం జిల్లా.. నెల్లూరు జిల్లా కేంద్రం గా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. కర్నూలు కేంద్రం గా కర్నూలు జిల్లా.. నంద్యాల ముఖ్య కేంద్రం గా నంద్యాల జిల్లా.. అనంతపురం కేంద్రం గా అనంతపురం జిల్లా.. పుట్టపర్తి జిల్లా కేంద్రం గా సత్యసాయి జిల్లా.. కడప కేంద్రం గా వైఎస్సార్ కడప జిల్లా.. రాయచోటి కేంద్రం గా అన్నమయ్య జిల్లా.. చిత్తూరు జిల్లా కేంద్రంగా చిత్తూరు జిల్లా.. తిరుపతి కేద్రం గా తిరుపతి జిల్లా ఏర్పాటయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: