అమరావతి : చంద్రబాబు ధైర్యమేంటో తెలిసిపోయిందా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఎంతటి ధైర్యవంతుడో మరోసారి జనాలందరికీ అర్ధమైపోయింది. రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామంటు చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల జనాలపైన రు. 1400 కోట్ల భారం పడబోతోంది. ఛార్జీలు పెంచటం అనివార్యం కాబట్టి పెంచకతప్పటంలేదని ప్రభుత్వం చెప్పింది. ధరల పెరుగుదలను ఎవరు కూడా అంగీకరించరన్న విషయం తెలిసిందే.




ఇక్కడే చంద్రబాబు సీనులోకి ఎంటరైపోయారు. ప్రజలందరినీ కూడగట్టుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద పోరాటాలు చేయటాన్ని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. మరి నరేంద్రమోడి సర్కార్ పెంచుతున్న ఇంధన ధరల మాటేమిటి ? గడచిన ఎనిమిదిరోజుల్లో పెట్రోలు, డీజల్ ధరలు ఏడు రోజులు పెరిగాయి. ఇపుడే కాదు మధ్యలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందర్భాన్ని మినహాయిస్తే అంతకుముందు ఇపుడు కూడా వరుసగా పెట్రోలో, డీజల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి.



నరేంద్రమోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అన్నింటి ధరలు పెరుగుతున్నా చంద్రబాబు ఏనాడు నిలదీసిన పాపానపోలేదు. అదేమంటే 2014 నుండి నాలుగేళ్ళు మిత్రపక్షం. ఆ తర్వాతేమో శతృపక్షం. ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మోడి ఓడిపోవటం ఖాయమన్న భావనలో మాత్రమే చంద్రబాబు నిలదీసి మాట్లాడారు. ఎప్పుడైతే 2019లో తాను ఓడిపోయి మోడి మళ్ళీ బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చారో అప్పటినుండి చంద్రబాబు గొంతు పడిపోయింది. కేంద్రాన్ని నిలదీయాల్సిన విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డినే నిలదీస్తున్నారు. 



మరి వాటిగురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదు. విద్యుత్ ఛార్జీలు పెరిగితే అది విద్యుత్ బిల్లు మీద మాత్రమే ఎఫెక్టుపడుతుంది. కానీ పెట్రోల్, డీజల్ ధరలు పెంచటం వల్ల సమస్త వస్తువుల ధరలు పెరిగిపోతాయని చంద్రబాబుకు తెలీదా ? సంవత్సరాలుగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజల ధరలను తగ్గించాలని నరేంద్రమోడిని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు ? ఇంధన ధరల పెరుగుదలపై ప్రజాపోరాటాన్ని చంద్రబాబు ఎందుకు చేయకూడదు ? ఇక్కడే మోడి అంటే చంద్రబాబుకు ఎంత భయమో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: