బీహార్ ముఖ్యమంత్రి పదవి తమకు కూడా కావాల్సిందే అని భారత జనతా పార్టీ ఎంఎల్ఏల డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజ్యసభకు వెళ్ళటానికి సిద్ధం అవుతున్నట్లు చెప్పటం కలకలం రేపుతోంది.ఒకవైపు సీఎం కుర్చీకోసం భారత జనతా పార్టీ డిమాండ్లు ఇదే సమయంలో రాజ్యసభకు వెళ్ళటంపై నితీష్ ప్రకటనను గమనిస్తే తొందరలోనే నితీష్ రాజీనామా చేయక తప్పదమో అని అనిపిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సంకీర్ణ ధర్మం పేరుతో 2020 ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్ నే సీఎంగా చేసింది. నిజానికి ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 43 సీట్లు బీజేపీ 74 సీట్లను గెలుచుకున్నాయి. అందుకే అప్పట్లోనే బీజేపీకి సీఎం కుర్చీ అంటు డిమాండ్లు బాగా వినిపించాయి.అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం సంకీర్ణ ధర్మం పేరుతో నితీష్ కుమార్ నే సీఎం చేశారు.
అప్పటి నుండి భారత జనతా పార్టీ లో అసంతృప్తి బాగా పెరిగిపోతోంది. ఏదో ఒక రూపంలో నితీష్ ను బీజేపీ మంత్రులు ఎంఎల్ఏలు స్ధానిక నేతలు బాగా ఇబ్బందులు పెడుతునే ఉన్నారు. ఒక దశలో బీజేపీతో నితీష్ కుమార్ కటీఫ్ చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు అనేవి సర్దుకున్నాయి. కానీ మళ్ళీ అలాంటి సమస్యలే ఇప్పుడు నితీష్ ను చుట్టుముడుతున్నాయి.ఈ మధ్యనే వికాస్ శీల్ ఇన్సాఫ్ (వీఐపీ)పార్టీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరడం జరిగింది. అప్పటినుండి బీజేపీకి సీఎం పదవి దక్కాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇదంతా కూడా బీజేపీ నేతలే వెనుకనుండి చేయిస్తున్నట్లు నితీష్ కుమార్ అనుమానిస్తున్నారు. బీజేపీ నేతలతో నెట్టుకురావటం చాలా ఇబ్బందిగా ఉన్నట్లుంది. అందుకనే తాజాగా మీడియాతో మాట్లాడుతు రాజ్యసభకు వెళ్ళాలనే కోరికను బయటపెట్టడం జరిగింది. బహుశా నితీష్ కుమార్ రాజ్యసభకు వెళితే కేంద్రమంత్రి అయిపోతారేమో చూడాలి.