ఏపీని వదలి తెలంగాణపై బాబు ఫోకస్ ?
టీడీపీ ఇప్పుడు ఆలోచిస్తే... తర్వాత ఆలోచించేది ఇతర పార్టీలు అని.. దుర్మార్గుడు ఏపీలో మీటర్ పెట్టాలంటున్నాడు... మీటర్ పెడితే రైతు మెడకు ఉరి తాడేనని పేర్కొన్నారు చంద్రబాబు. వెనుకబడిన వర్గాలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించామమన్నారు చంద్రబాబు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు కారణం నేనే... ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనే అని చెప్పారు చంద్రబాబు. రాను అని చెప్పిన వారిని నా దగ్గరకు రప్పించుకొని ఆ తర్వాత తప్పించుకోకుండా ఉంచడం నాకు తెలుసని... బయోటెక్నాలజీకి మంచి రోజులు వస్తున్నాయని ముందే ఊహించి జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇప్పుడు జినోమ్ వ్యాలీలో కరోనకు వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప పరిణామమని.. బిల్ గెట్స్ 5 నిమిషాలు సమయం ఇచ్చి... అర్ధ గంట నాతో మాట్లాడారన్నారు చంద్రబాబు. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి బిల్ గెట్స్ ఆకర్షితుడైయ్యారని.. దావూద్ కు వెళ్లి బిల్ గెట్స్ సమావేశం నిర్వహించా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో పెడతామని చెప్పి... ఇక్కడే పెట్టారు అప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు అయ్యారన్నారు చంద్రబాబు.