సొంతూరులో బీహార్ సీఎంపై వ్యక్తి దాడి... ?

VAMSI
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై నిండు సభలో దాడి జరిగింది అంటే అది ఆషామాషీ విషయమేమీ కాదు.   అలాంటి సంఘటనే ఒక సిఎంకి ఇపుడు ఎదురు కావడం దురదృష్టకరం. ఈ సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి జరగడం సంచలనంగా మారింది. అందులోనూ ఆ దాడి ఆయన స్వగ్రామంలోనే చోటు చేసుకోవడం తో అంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వగ్రామం భక్తియార్‌పూర్‌ లో స్థానిక సఫర్ హాస్పిటల్ కాంప్లెక్స్‌ నుండి రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి నివాళులు అర్పించడానికి ముఖ్యమంత్రి నితీష్ వెళ్ళడం జరిగింది.

అయితే అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి అనూహ్యంగా వచ్చి సిఎం పై దాడి చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో ఈ సంఘటన రికార్డ్ అయింది. భారీ భద్రతా లోపం వలనే ఇలా జరిగిందని అంతేకాకుండా సిఎం పై దాడి చేసిన ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం. మరి కొందరు ఇది ప్రత్యర్ధుల పనే అని అంటున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేస్తున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని మందిలిస్తుండగా, సిఎం నితీష్ వెంటనే వారిని ఆపి అతడిని ఏమి అనకండి ముందు అతడు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు చెప్పనివ్వండి అంటూ అనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇది ఆయన దయాగుణానికి, ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనం అని.. అందుకే ఆయన్ని బాధించిన వారిని సైతం ఆయన మంచే చేయాలనే చూస్తారని అధికార పార్టీ నేతలు నితీష్ కు జేజేలు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో జరిగిన వాస్తవం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: