రాయలసీమ : ఈ నియోజకవర్గంలో జనసేనకు దిక్కేలేరా ?

Vijaya


అంటే ఒక నియోజకవర్గంలో దిక్కుండి మరో నియోజకవర్గంలో దిక్కు లేరా అని అర్ధంకాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేసి జనసేనను 175 నియోజకవర్గాల్లో  పోటీచేయమంటే ? చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే అభ్యర్ధులే ఉండరన్నది వాస్తవం. జనసేన అధినే పవన్ కల్యాణ్  పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు కానీ నిజానికి పార్టీలో ఉన్న సమస్యలేంటో ఆయనకు బాగా తెలుసు.



అన్నీ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్ధులే ఉండరు. పోటీ చేయటమంటే పార్టీ తరపున నామినేషన్లు వేయటంకాదు.  గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్ధులకు కనీసం గట్టిపోటీ ఇచ్చేంత సీనయినా ఉండాలి కదా. ఆ సీనే జనసేనకు లేదన్నది వాస్తవం. సరే విషయంలోకి వస్తే నగిరిలో పార్టీ నేతల రచ్చ మామూలుగా లేదు. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున అప్పుడెప్పుడో ఓ వెలుగు వెలిగిన నటి వాణీ విశ్వనాధ్ పోటీ చేయాలంటు గోల చేస్తున్నారు.



ఆమే ఎందుకు పోటీచేయాలంటే వైసీపీ ఎంఎల్ఏ రోజాకు వాణి అయితే గట్టి పోటీ ఇస్తుందట. మరి లోకల్ లీడర్లంతా ఏమయ్యారంటే ఎవరు మాట్లాడటంలేదు. రెండు రోజులుగా వాణికి మద్దతుగా నగిరిలో పెద్ద ర్యాలీలే జరుగుతున్నాయి.  ఆమె కూడా రెగ్యులర్ గా నగిరిలో పర్యటిస్తున్నారు. కారణం ఏమిటంటే పోటీకి రెడీగా ఉన్నారట. ఏ పార్టీ తరపునంటే ఏ పార్టీ తరపునైనా సరే అంటున్నారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే చివరకు ఇండిపెండెంట్ గా అయినా పర్వాలేదంటున్నారు.



అసలు నగిరిపైనే వాణికి ఎందుకింత ఇది ? ఎందుకంటే ఆమె అమ్మమ్మ ఇక్కడ నర్సుగా పనిచేశారట. ఆమె అమ్మమ్మ పోటీచేస్తే వాణి పోటీచేసేయటమేనా ? ఆమెకు ఎవరు తెలియాల్సిన అవసరం లేదా ? అంటే అవసరమే లేదంటున్నారు. తనంటే తెలీని వాళ్ళుండరు కాబట్టి తాను నామినేషన్ వేస్తే చాలు విక్టరీయే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి గోల 2019 ఎన్నికల ముందుకూడా బాగా జరిగింది.  ఏమైందో తెలీదు అడ్రస్ కనబడలేదు. మళ్ళీ ఇఫుడు ఎన్నికల ముదు రెడీ అయ్యారు. మరి ఈ సారి ఏమవుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: