టీడీపీ టార్గెట్ లిస్ట్‌: కొడాలి నానికి సినిమా చూపించడం గ్యారెంటీ ?

Veldandi Saikiran

* బూతులకు కెరాఫ్‌ అడ్రాస్‌ నాని
* బాబు కుటుంబంపై పచ్చి బూతులు
* అసెంబ్లీలో టీడీపీని ర్యాగింగ్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో.... వైసిపి పార్టీని టార్గెట్ చేయడం మొదలైంది. జూన్ 4వ తేదీన ఫలితాలు రిలీజ్ కాగానే... వైసిపి కార్యకర్తలు అలాగే నేతలపై దాడులకు దిగారు తెలుగు తమ్ముళ్లు. ఎక్కడికక్కడ... వైసిపి జెండాలను తగలబెట్టడం, గద్దెలను కూల్చడం, వైయస్సార్ పేరును తొలగించడం  మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు. అయితే ఇకముందు... జగన్మోహన్ రెడ్డి పాలనలో... రెచ్చిపోయిన వైసీపీ నేతలను కూడా.. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు  టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.
 అలా టిడిపి టార్గెట్ చేసే నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని మొదటి వరుసలో ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో... టిడిపి నేతలను కొడాలి నాని  తిట్టినన్ని తిట్లు... ఎవరు తిట్టలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని..  అత్యంత దారుణంగా దూషిస్తూ రెచ్చిపోయారు కొడాలి నాని. వారంలో ఒకటికి రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి... చంద్రబాబును అలాగే తెలుగు తమ్ముళ్లను.. తిట్టేవారు కొడాలి నాని.
 అటు అసెంబ్లీలో కూడా నారా భువనేశ్వరి గురించి... నారా లోకేష్ పుట్టుక గురించి... ఎవరు మాట్లాడలేని విధంగా మాట్లాడారు కొడాలి నాని. అయితే వీటన్నిటిని తెలుగుదేశం పార్టీ నేతలు.. రివైండ్ చేసుకొని మరీ కొడాలి నాని టార్గెట్ చేస్తారు. ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవలేదు కనుక... అసెంబ్లీ బయటనే... గుడివాడ నియోజకవర్గంలో... అడుగడుగునా కొడాలి నాని కి ఇబ్బందులు పెడతారు.
 కొడాలి నాని క్యాడర్ను  మొత్తం లాగేస్తారు. అసలు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అడ్రస్ గల్లంతు చేసే ఛాన్స్ కూడా ఉంది. కొడాలి నాని అండగా ఉన్న గుడివాడ నియోజకవర్గంను తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారుస్తారు. కొడాలి నాని చేసిన అన్యాయాలు, భూకబ్జాలు బయటకు తీస్తారు తెలుగు తమ్ముళ్లు. న్యాయపరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్లీ మైక్ పట్టకుండా కొడాలి నానిని... టిడిపి టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరోసారి చంద్రబాబు కుటుంబాన్ని గురించి... మాట్లాడాలంటే వనికి పోయాలా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: