సజ్జనార్ మరో సంచలనం.. ప్రయాణికులు హ్యాపీ?

praveen
టిఎస్ ఆర్టిసి ఎండి గా ఒకప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అనూహ్యమైన మార్పులు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు ప్రయాణికులు అందరికీ కూడా ఎంతో అద్భుతమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీపీ సజ్జనార్. ఈ క్రమంలోనే అటు తరచూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ స్వయంగా ప్రయాణికులతో మాట్లాడుతూ అసలైన అవసరాలు ఏంటి ప్రయాణికులు ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్నారు.

 తద్వారా ఇక ఆర్టీసీలో ప్రయాణికులు అందరికీ మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సిద్ధం అవుతున్నారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనర్. ఈ క్రమంలోనే అటు హైదరాబాద్ నగరంలో ఉన్న బస్ స్టేషన్లలో కూడా ఎంతోమంది మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సరికొత్త నిర్ణయాలు తీసుకుని సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ప్రతి ఒక్కరికి మెరుగైన ప్రయాణం కోసం అద్భుతమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. రామప్ప దేవాలయం లక్నవరం ఒకేసారి చూసే అవకాశాన్ని కల్పిస్తుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ.

 ఈ క్రమంలోనే ప్రయాణికుల అందరి కోసం రామప్ప దర్శన్ పేరిట ఒక ప్రత్యేక బస్సు సర్వీసులు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సెలవు దినాలు ప్రతి రెండవ శనివారం ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సర్వీసులు ఉదయం 9 గంటల నుంచి హనుమకొండ డిపో బయలుదేరుతున్న ట్లు వెల్లడించారు ఆయన. ఇక ఈ సదుపాయాలను ప్రయాణికులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిపో మేనేజర్ సంప్రదించాలని.. దీనికోసం 9959226048 నెంబర్ కు ఫోన్ చేయాలి అని టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జన సూచించారు. ఈ నిర్ణయంపై అందరూ హర్షం   వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: