"జనసేనాని" పవన్ కళ్యాణ్ ఆశలు తీరేనా?

VAMSI
వామ్మో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీపై నిప్పులు కురిపిస్తూ దానిపై ఇంకాస్త విమర్శల పెట్రోల్ ను కూడా బాగా దట్టించారుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి జనసేన 9వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ వైఎస్ఆర్ సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటికాడు రెండు కాదు వరుస పెట్టి ఆ పార్టీ చేసిన తప్పులు ఇవే అంటూ గరుడ పురాణం చెప్పేశారు. ఇంతకు ఆయన ఏమన్నారు అంటే.... రాష్ట్ర ప్రయోజనాల కొరకు 2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రకటన చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాలు వీడితే రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది అన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూల్చి వేతలతో అశుభ కార్యాలలో  ప్రారంభమయ్యింది. కారణాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా మూడు నెలలకే ఇసుక సమస్య రావడం , భావన నిర్మాణ కార్మికులు రోడ్డున పడటం వంటివి అవి నిజమే అన్న భావన కలిగిస్తాయని అని ఆయన అన్నారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలితీసుకుంది అని... నాటి నుండి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు కూడా అన్నీ విధ్వంసాలే! ప్రభుత్వంలో ఇంత నెగటివ్‌ మనుషులా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఒక కులాన్ని టార్గెట్ చేయడం మూర్కత్వాన్ని చూపుతుందని మనుషులను గుర్తిస్తే చాలు కులాల , వర్గ భేదం చూపటం ఏంటి అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వైశ్య సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అంటూ విమర్శలు కురిపించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ వాళ్ళు పట్టపగలే కళలు కంటున్నారు అంటూ జోకులు వేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కలలు ఆశలు తీరుతాయా? పవన్ నిజమ్గానే సీఎం అవుతాడా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: