ప్లేయర్లే కాదు.. ఐపీఎల్ సీజన్ అరుదైన రికార్డు?

praveen
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఈ ఐపీఎల్ దాదాపు నెల రోజులుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ పోరు ప్లే ఆఫ్ దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఇక అన్ని జట్ల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారిపోయింది. పాయింట్స్ పట్టికలో తొలి నాలుగు స్థానాలలో నిలబడమే లక్ష్యంగా జట్లు కూడా ఎంతో కష్టపడి పోతున్నాయి.

 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. అయితే గత ఐపిఎల్ సీజన్లతో పోల్చి చూస్తే ఈ సీజన్లో పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు నమోదు అవుతున్నాయి. బ్యాట్స్మెన్లందరూ కూడా వీర విద్వాంసాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ లో 200 పరుగులను దాటడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక అన్ని టీమ్స్ కూడా సెంచరీలతో చెలరేగిపోతున్నాయి. అయితే ఇప్పుడు వరకు ఇలా అద్భుతమైన బ్యాటింగ్ తో  ఎంతోమంది ఆటగాళ్లు ఐపీఎల్లో రికార్డులు సృష్టించగా.. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజనే ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం 14 సెంచరీలు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఇన్ని శతకాలు నమోదు కాలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బ్యాట్స్మెన్లు గిల్, సుదర్శన్లు సెంచరీలు చేయడంతో.. ఈసారి శతకాల సంఖ్య 14 కు చేరింది. కాగా 2023 సీజన్లో 12 సెంచరీలు నమోదు అవ్వగా.. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా కొనసాగింది. ఇక ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: